Sharwanand : సంపత్ నంది గాంజా హీరో మారాడు

Sharwanand :  సంపత్ నంది గాంజా హీరో మారాడు
X

మాస్ డైరెక్టర్ సంపత్ నందికి కొత్త హీరో దొరికాడు. 2010లో ఏమైంది ఈ వేళతో దర్శకుడుగా ప్రయాణం మొదలుపెట్టిన సంపత్ కెరీర్ ఊహించినంత వేగంగా సాగలేదు. రెండో సినిమాకే రామ్ చరణ్ కు రచ్చ వంటి బ్లాక్ బస్టర్ ఇచ్చినా స్టార్ హీరోలెవరూ ఆఫర్స్ ఇవ్వలేదు. రవితేజ తో చేసిన బెంగాల్ టైగర్, గోపీచంద్ సీటీమార్ కమర్షియల్ సక్సెస్ లు సాధించాయి. మధ్యలో నిర్మాతగా చేసిన ప్రయత్నాలు కూడా పెద్దగా వర్కవుట్ కాలేదు. కొన్ని రోజుల క్రితం మెగా కాంపౌండ్ నుంచి సాయిదుర్గా తేజ్ హీరోగా గాంజా శంకర్ అనే టైటిల్ తో కొత్త సినిమా అనౌన్స్ అయింది. పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతుందని చెప్పిన ఈ కథ ఎక్కువ బడ్జెట్ ను డిమాండ్ చేసిందట. దీంతో ప్రాజెక్ట్ ఆగిపోయింది. దీనికి తోడు ఆ టైటిల్ పై తెలంగాణ ప్రభుత్వం సీరియస్ అయింది కూడా.


సాయితేజ్ తప్పుకున్నా సంపత్ నందికి శర్వానంద్ దొరికాడు. కొన్నాళ్లుగా హిట్లే లేక ఇబ్బంది పడుతున్నాడు శర్వానంద్. అతనికిది 38వ సినిమా. కేకే రాధామోహన్ నిర్మిస్తున్నాడు. మరి ఇది గాంజా శంకర్ కథేనా లేక వేరే కథా అనేది తెలియాల్సి ఉంది. అయితే ఈ మూవీ కూడా 1960ల నేపథ్యంలో సాగుతుందట. అంటే కథ మారి ఉండొచ్చు అంటున్నారు. అనౌన్స్ మెంట్ తో పాటు రిలీజ్ చేసిన పోస్టర్ లో సముద్రంపై మంటలు రేగుతున్న ఫోటో ఉంది. విశేషం ఏంటంటే.. ఇది ప్యాన్ ఇండియా సినిమాట. ఇద్దరికీ ఇదే ఫస్ట్ ప్యాన్ ఇండియన్ మూవీ అవుతుందని చెప్పొచ్చు. మొత్తంగా ఇది గాంజా శంకర్ కథేనా లేక కొత్తదా అనేది చూడాలి.

Tags

Next Story