ప్రముఖ రాజకీయ నాయకుడి బయోపిక్‌లో సముద్రఖని

దర్శకుడిగా మారిన సముద్రఖని వైవిధ్యమైన పాత్రలు చేస్తూ తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పరుచుకున్నారు, తమిళంతో పాటు తెలుగులోనూ అత్యంత బిజీ నటుల్లో ఒకరుగా వెలుగొందుతున్నారు. సినిమాని డైరెక్ట్ చేసినా, సినిమాలో ఓ క్యారెక్టర్ చేసినా అద్భుతంగా పండిస్తారు. సముద్రఖని నిజానికి కథకు, ఆ కథలో తన పాత్రకు తగిన ప్రాధాన్యం, శక్తి ఉంటేనే ఓకే చేస్తారు.
ఇదిలా ఉంటే, ప్రముఖ రాజకీయ నాయకుడి బయోపిక్ లో నటించేందుకు సముద్రఖని సైన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని సమాచారం. ఆయన అవినీతి లేని రాజకీయ నాయకుడని, ప్రజల మనిషిగా నియోజక వర్గంలో సభ్యుల మధ్య పేరు తెచ్చుకున్న గొప్ప మానవతావాది అని సినీ వర్గాల సమాచారం. ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్న వ్యక్తి. సొంత ఇల్లు కూడా లేని నిస్వార్థ జీవి. అతడి వ్యక్తిత్వం, నిజాయితీకి నిలువెత్తు రూపం అయిన అతడి గురించి భవిష్యత్ తరాలకు తెలియాలనే ఉద్దేశంతో అతడి జీవిత చరిత్రను సినిమాగా తీస్తున్నారు. అందులో సముద్రఖని నటించడం విశేషం.
ఆ రాజకీయ నాయకుడి గురించి తెలుసుకున్న సముద్రఖని.. అవినీతి మచ్చలేని నాయకుడు కావడంతో నటించేందుకు ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీకి సంబంధించి గ్రౌండ్ వర్క్ పూర్తయినట్లు తెలుస్తుండగా.. ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఎలాంటి క్యారెక్టర్ లో అయినా ఒదిగిపోయే సముద్రఖని ఆదర్శవంతమైన ఆ రాజకీయ నాయకుడి పాత్రలో జీవిస్తారని చెప్పక్కర్లేదు. ఈ మూవీకి సంబంధించి పూర్తి అప్‌డేట్స్ త్వరలోనే వెల్లడయ్యే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం ధనరాజ్ దర్శకత్వంలో సముద్రఖని ఓ సినిమా చేస్తున్నారు. సముద్రఖని.. చివరగా పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కాంబోలో బ్రో మూవీకి దర్శకత్వం వహించి హిట్ కొట్టారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com