సినిమా

Samuthirakani : అవును.. పవన్‌తో సినిమా చేస్తున్నా.. హైప్ పెంచేసిన సముద్రఖని..!

Samuthirakani : తనలాంటి అభిమానుల దృష్టిలో పెట్టుకొని వినోదాయ సీతాం సినిమాను తెరకెక్కించనున్నట్టు అధికారికంగా వెల్లడించాడు.

Samuthirakani : అవును.. పవన్‌తో సినిమా చేస్తున్నా.. హైప్  పెంచేసిన  సముద్రఖని..!
X

Samuthirakani : తమిళ్ లో సముద్రఖని దర్శకత్వంలో వచ్చిన 'వినోదాయ సీతాం' సినిమాని తెలుగులో స్టార్ హీరో పవన్ కళ్యాణ్ రీమేక్ చేయబోతున్నారంటూ కొన్నిరోజుల క్రితం వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.. ఐతే ఈ వార్తల పైన సముద్రఖని క్లారిటీ ఇచ్చారు.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సముద్రఖని మాట్లాడుతూ.. తాను పవన్ కళ్యాణ్ అభిమానని, తనలాంటి అభిమానుల దృష్టిలో పెట్టుకొని వినోదాయ సీతాం సినిమాను తెరకెక్కించనున్నట్టు అధికారికంగా వెల్లడించాడు. ఈ ప్రాజెక్ట్ గురించి మాట్లాడాలన్న తొందర చాలా ఉందని ఆ శుభవార్త త్వరలోనే పంచుకుంటానని చెప్పుకొచ్చాడు.

ఫాంటసీ డ్రామాగా రూపొందిన ఈ చిత్రంలో తంబి రామయ్య, సముద్రఖని కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాని తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా మార్పులు చేస్తున్నారు. ఆ బాధ్యత త్రివిక్రమ్ కి అప్పజేప్పినట్టుగా తెలుస్తోంది. ఈ సినిమాలో పవన్ తో పాటుగా సాయి ధరమ్ తేజ్ కూడా నటించే అవకాశం ఉంది.

కాగా ఇటీవల భీమ్లానాయక్, సర్కారు వారి పాట సినిమాలలో విలన్ గా నటించి మెప్పించాడు సముద్రఖని.

Next Story

RELATED STORIES