Samyuktha Menon : సంయుక్త హీరోయిన్ గా కొత్త సినిమా ప్రారంభం

Samyuktha Menon : సంయుక్త హీరోయిన్ గా కొత్త సినిమా ప్రారంభం
X

Samyuktha Menon : టాలీవుడ్ లో వరుస విజయాలతో దూసుకుపోతున్న హీరోయిన్ సంయుక్త మీనన్. ఆమె త్వరలోనే మరో కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. హాస్య మూవీస్ బ్యానర్‌పై, యోగేశ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కబోతోంది. ఈ సినిమా తాజాగా పూజా కార్యక్రమంతో ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి దిల్ రాజు, కోనా వెంకట్, రానా వంటి ప్రముఖులు హాజరై శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సినిమా గురించి మాట్లాడుతూ సంయుక్త తన ఆనందాన్ని వ్యక్తం చేసింది. ఈ కథ చాలా ఆసక్తికరంగా ఉందని, దర్శకుడు దీని కోసం చాలా కాలం కష్టపడ్డారని తెలిపారు. తన తెలుగు సినిమాలన్నీ హిట్ అవడానికి కారణం తన మేనేజర్ అని, ఆయనే తనకు కథలు ఎంపిక చేస్తారని చెప్పారు. ఈ కథ విన్నప్పుడు తన సినిమా జర్నీ గుర్తుకు వచ్చిందని, షూటింగ్‌ ఎప్పుడు ప్రారంభమవుతుందో అని ఆత్రంగా ఎదురుచూస్తున్నానని తెలిపారు.

నిర్మాతలు ఈ సినిమాను కమర్షియల్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిస్తున్నట్లు తెలిపారు. ఈ సినిమా స్క్రిప్ట్ చాలా బలంగా ఉందని, తప్పకుండా హిట్ అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

Tags

Next Story