Samyuktha Menon : పాపం సంయుక్తా .. హిట్లు పడుతున్నా.. ఆఫర్లు నిల్
![Samyuktha Menon : పాపం సంయుక్తా .. హిట్లు పడుతున్నా.. ఆఫర్లు నిల్ Samyuktha Menon : పాపం సంయుక్తా .. హిట్లు పడుతున్నా.. ఆఫర్లు నిల్](https://www.tv5news.in/h-upload/2024/02/15/1189659-samyuktha-menon.webp)
భీమ్లా నాయక్ సినిమాతో టాలీవుడ్ లోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది మలయాళం బ్యూటీ సంయుక్తా మీనన్. పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన ఈ సినిమాలో రానాకి జోడీగా ఈ అమ్మడు నటించింది. అయినప్పటీకి సంయుక్తా మీనన్ కి ఈ సినిమా ద్వారా మంచి గుర్తింపే వచ్చింది. ఆ తరువాత బింబిసారలో ఛాన్స్ అందుకుంది. ఆ సినిమా కూడా హిట్ కావడంతో టాలీవుడ్ లక్కీ లేడీ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. అనంతరం తెలుగు, తమిళ్ లో తెరకెక్కిన సార్ సినిమాతో మరో హిట్ అందుకుంది. దీంతో ఏకంగా హ్యాట్రిక్ హిట్స్ ను ఈ బ్యూటీ అందుకుంది.
సాయి ధరం తేజ్ తో చేసిన విరూపాక్షతో కూడా సక్సెస్ అయ్యింది. ఇలా తాను చేసిన ప్రతి సినిమా సక్సెస్ అవ్వడంతో సంయుక్త టాలీవుడ్ లో ప్రత్యేకంగా నిలిచింది. ఇన్ని హిట్లు సాధించిన సంయుక్తకు వరుస ఆఫర్ల వస్తాయని అందరూ భావించారు. కానీ అలా జరగలేదు. రీసెంట్ గా ఈ అమ్మడు చేసిన సినిమా అంతగా వర్క్ అవుట్ అవ్వకపోవడంతో కెరీర్ లో డీలా పడింది. ఒక్క సారిగా ఆఫర్లు తగ్గిపోయాయి.
ప్రస్తుతం సంయుక్తా చేతిలో నిఖిల్ స్వయంభు మాత్రమే ఉంది. దీంతో వరుసగా హిట్లు కొట్టినా ఆఫర్లు మాత్రం సంయుక్తాకి అంతగా రావట్లేదు. స్వయంభు సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది. ఈ సినిమాను పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com