Bigg Boss OTT 3 Winner : బిగ్ బాస్ ఓటీటీ 3 విజేత సనా మక్బుల్

Bigg Boss OTT 3 Winner :  బిగ్ బాస్ ఓటీటీ 3 విజేత సనా మక్బుల్
X

టాలీవుడ్ మూవీ దిక్కులు చూడకు రామయ్యతో సినీ రంగంలోకి అడుగుపెట్టిన హీరోయిన్ సనా మక్బుల్ హిందీ బిగ్ బాస్ ఓటీటీ 3 రియాల్టీ షో విజేతగా నిలిచింది. షో ట్రోపీతో పాటు రూ. 25 లక్షల ప్రైజ్ మనీని గెలుచుకున్నది. సనాకు, నేజీకు మధ్య చివరి వరకు తీవ్ర పోటీ జరిగింది. చివరకు సనానే విజేతగా బాలీవుడ్ వెటరన్ హీరో, హోస్ట్ అనిల్ కపూర్ ప్రకటించారు. మరో తెలుగు సినిమా మామా ఓ చందమామా మూవీలో నటించినా ఆ సినిమా ఫ్లాప్ తో ఇక్కడ ఈ బ్యూటీకి నిరాశే ఎదురైంది. ఆ తరువాత వివిధ రియాల్టీ షోలలో పాల్గొని తన అందచందాలతో దేశమంతా పేరు తెచ్చుకుంది. పలు సీరియల్స్, సినిమాల్లోనూ నటిస్తూ తనకంటూ పేరు తెచ్చుకునే ప్రయత్నం చేస్తుందీ ఈ ముంబై బ్యూటీ. ఇప్పుడైనా ఈ అమ్మడికి అవకాశాలు వస్తాయో లేదో చూడాలి.

Tags

Next Story