Shivaram: సీనియర్ నటుడు శివరామ్ అంత్యక్రియలు పూర్తి.. హాజరైన సీఎం..

Shivaram (tv5news.in)
Shivaram: ఈ ఏడాది సినీ పరిశ్రమ ఇప్పటికే ఎన్నో చేదు వార్తలను వినాల్సి వచ్చింది. ఎందరో గొప్ప నటులు, గాయకులు, సంగీత దర్శకులు, రచయితలు ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. తాజాగా మరో సీనియర్ నటుడు కూడా అనారోగ్యంతో కన్నుమూశారు.
అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్‌ను ప్రారంభించిన శివరామ్.. సీనియర్ నటుడి స్థాయికి వరకు ఎదిగారు. ఈయన కెరీర్ శాండిల్‌వుడ్‌లోనే మొదలుపెట్టినా.. పలు బాలీవుడ్ చిత్రాల్లో కూడా శివరామ్ మెరిసారు. బాలీవుడ్ మాత్రమే కాదు అప్పుడప్పుడు కోలీవుడ్ ప్రేక్షకులను కూడా ఈయన పలకరించారు.
83 ఏళ్ల వయసున్న శివరామ్ గతవారం తన నివాసంలో ఉన్నట్టుండి కుప్పకూలిపోయారు. అప్పటి నుండి బెంగుళూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇటీవల ఆయన తుదిశ్వాస విడిచినట్టుగా ఆసుపత్రి యాజమాన్యం వెల్లడించారు. ఆదివారం ఉదయం శివరామ్ అంత్యక్రియలు ముగిశాయి. కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై హాజరయ్యి శివరామ్‌కు నివాళులు అర్పించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com