Kiara Adwani : శాండల్ వుడ్ ను షేక్ చేస్తోన్న కియారా అద్వానీ

Kiara Adwani :  శాండల్ వుడ్ ను షేక్ చేస్తోన్న కియారా అద్వానీ
X

కియారా అద్వానీ.. ఇప్పటి వరకూ గ్లామరస్ హీరోయిన్ గానే తప్ప గ్రేట్ పర్ఫార్మర్ అనిపించుకున్న సందర్భాలేం లేవు. ఇప్పటి వరకూ తన వరకూ వచ్చిన పాత్రల్లో మెప్పిస్తోందంతే. అలాంటి హీరోయిన్ గురించి కన్నడ ఇండస్ట్రీ అంతా మాట్లాడుకుంటోంది. అంటే తన నటన గురించి కాదులెండి. ఆమె తీసుకుంటోన్న రెమ్యూనరేషన్ గురించి. యస్.. ప్రస్తుతం రెమ్యూనరేషన్ పరంగా ఇండియాలో టాప్ ఫైవ్ లోకి ఎంటర్ అయిపోయింది కియారా. తన వల్లే ఆడిన సినిమాలేం కనిపించడం లేదు. తను బలమైన ఇంపాక్ట్ వేసింది అని చెప్పే సినిమాలూ లేవు. అయినా ఆమె గురించి ఇంతలా మాట్లాడుకుంటున్నారంటే మరి అంతలా ఉంది ఆమె పారితోషికం.

ప్రస్తుతం ఎన్టీఆర్, హృతిక్ రోషన్ ల వార్ 2 లో నటిస్తోంది కియారా. ఇది కాక హిందీలో ఇంకేం సినిమాలు లేవు. కన్నడలో కేజీఎఫ్ స్టార్ యశ్ సరసన టాక్సిక్ లో నటిస్తోంది. నెక్ట్స్ ప్రాజెక్ట్స్ ఆపడానికి కారణం తను ఇప్పుడు ప్రెగ్నెంట్ కావడమే. ఇక టాక్సిక్ కోసం కియారాకు ఇస్తోన్న రెమ్యూనరేషన్ 15 కోట్లు. యస్.. అక్షరాలా పదిహేను కోట్లు అంటున్నారు. ఈ బడ్జెట్ తో కన్నడలో ఓ ఐదారు సినిమాలు తీసేయగలరు. అంత బడ్జెట్ అమ్మడికి రెమ్యూనరేషన్ గా ఇస్తున్నారంటే ఖచ్చితంగా ఈ క్యారెక్టర్ సినిమాలో ప్రాధాన్యమున్నదే అవుతుంది. ఇంత పారితోషికం ప్రస్తుతం ఇండియాలో ప్రియాంక చోప్రా, దీపికా పదుకోణ్, నయనతార, రష్మిక మందన్నా వంటి వారే తీసుకుంటున్నారు. ఆ తర్వాత కియారానే కనిపిస్తోంది. ఏదేమైనా హీరోలతో సమానంగా మాకెందుకు ఇవ్వరు రెమ్యూనరేషన్ ఇవ్వరు అని అడిగే అవసరం రోజు రోజుకూ తగ్గుతోంది హీరోయిన్లకు అని చెప్పొచ్చు.

Tags

Next Story