Sandeep Kishan : ఒటిటిలోకి రాబోతోన్న మజాకా

Sandeep Kishan :  ఒటిటిలోకి రాబోతోన్న మజాకా
X

సందీప్ కిషన్, రీతూవర్మ జంటగా రావు రమేష్, అన్షు కీలక పాత్రల్లో నటించిన సినిమా మజాకా. త్రినాథరావు నక్కిన డైరెక్ట్ చేసిన ఈ చిత్రం గత నెల 26న విడుదలైంది. కాకపోతే ప్రేక్షకుల నుంచి ఆశించినంత గొప్ప స్పందన రాలేదు. ఫోర్స్ డ్ కామెడీ అన్నారు. కమర్షియల్ గా కూడా పెద్దగా వర్కవుట్ కాలేదు. రెండు దశాబ్దాల క్రితం మన్మథుడు సినిమాలో హీరోయిన్ గా మెరిసిన అన్షు ఈ మూవీతో రీ ఎంట్రీ ఇచ్చింది. యశోద పాత్రలో తను బాగా ఆకట్టుకుంది. రావు రమేష్ పాత్ర సైతం బానే ఉంది. కాకపోతే సినిమా అంతా ఊహించేలాగానే ఉండటం పెద్ద మైనస్ అయింది. ఎక్కడా చిన్న కాన్ ఫ్లిక్ట్ లేకపోవడంతో స్క్రీన్ ప్లే ఫ్లాట్ గా తేలిపోయింది అన్నారు చూసిన వాల్లంతా. అందుకే థియేటరస్ లో పెద్దగా విజయం సాధించలేదు. ఇప్పుడీ చిత్రం ఓటిటిలోకి రాబోతోంది.

ఈ నెల 28 నుంచి మజాకా ఓటిటిలో స్ట్రీమ్ కాబోతోంది. ఈచిత్ర ఓటిటి రైట్స్ ను ప్రముఖ ఓటిటి సంస్థ జీ5 సొంతం చేసుకుంది. ఇలాంటి సినిమాలు థియేటర్స్ లో కంటే ఓటిటిలో కాస్త ఎక్కువగా ఆకట్టుకుంటాయి అనేది నిజం. మరి ఈ మూవీ కూడా జీ5లో హిట్ టాక్ తెచ్చుకుంటుందా లేదా అనేది చూడాలి.

Tags

Next Story