Dil Diya : సందీప్ రెడ్డి వంగా ఆవిష్కరించి దిల్ దియా టైటిల్

వైవిధ్యమైన పాత్రలతో విలక్షణ నటుడిగా తనదైన గుర్తింపు సంపాదించుకున్న చైతన్యరావు మాదాడి కథానాయకుడిగా వెర్సటైల్ డైరెక్టర్ కె.క్రాంతి మాధవ్ దర్శకత్వంలో రూపొందుతోన్న రా అండ్ రూటెడ్ ఫిల్మ్ ‘దిల్ దియా-ఏ నేక్డ్ ట్రూత్’ అనేది ట్యాగ్ లైన్. శ్రియాస్ చిత్రాస్, ఎ పూర్ణ నాయుడు ప్రొడక్షన్ బ్యానర్స్‌పై పూర్ణ నాయుడు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. చిత్రీకరణ జరుపుకుంటోన్న ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్‌ను సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా విడుదల చేసి చిత్ర యూనిట్‌ను అభినందించారు.
ఈ సినిమా భావోద్వేగాలు, వ్యక్తిగత సంబంధాల మధ్య వచ్చే సంఘర్షణలను చూపించే ట్రెండింగ్ డ్రామాగా ఉండబోతుంది. కె. క్రాంతి మాధవ్‌కి ‘దిల్ దియా ..ఏ నేక్డ్ ట్రూత్’ ఆయన ఇప్పటివరకు చేసిన భావోద్వేగాత్మక సినిమాల ప్రయాణానికి కొనసాగింపులానే ఉంటుంది. ఆయన తన సినిమాల్లో ఎమోషన్స్‌లో డెప్త్‌తో పాటు బలమైన కథలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంటారు. ఆయన తెరకెక్కించిన ఓనమాలు, మళ్లీ మళ్లీ ఇది రాని రోజు, వరల్డ్ ఫేమస్ లవర్ వంటి సినిమాలను గమనిస్తే.. ప్రేమ, మనసుల్లోని భావాలు, అంతర్గత సంఘర్షణలు పాత్రల రూపంలో స్పష్టంగా కనిపిస్తాయి. ఇప్పుడు మరోసారి క్రాంతి మాధవ్ వైవిధ్యమైన మూవీ ‘దిల్ దియా – ఏ నేక్డ్ ట్రూత్’ సినిమాలో నేటి ట్రెండ్‌కు తగినట్లు ప్రేమ, మోహం, వైఫల్యం, వ్యక్తులు లేదా మనసుల మధ్య ఉండే సానిహిత్యం, ఆత్మ గౌరవం వంటి ఎలిమెంట్స్‌పై ఫోకస్ చేస్తూ వంటి ఎమోషనల్ వరల్డ్‌తో ప్రేక్షకులను మెప్పించటానికి సన్నద్ధమవుతున్నారు.
చైతన్యరావు మాదాడి, ఇరా, సఖి, జెస్సీ ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న ఈ చిత్రంలో మణి చందన, ప్రమోదిని, వీర శంకర్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సినిమా నేచురల్‌గా ఉండాలనే ఆలోచనతో డైరెక్టర్ అండ్ టీమ్ నటీనటులను ఎంపికలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దీని వల్ల సినిమాలో ఓవర్ డ్రామా లేకుండా నేచురాలిటీ కనిపిస్తుంది. ఎమోషన్స్ ఆడియెన్స్‌కు బాగా కనెక్ట్ అవుతాయి.
ఫస్ట్ లుక్, టైటిల్ పోస్టర్‌ను గమనిస్తే.. బట్టలు లేకుండా సొఫాలో కూర్చున్న చైతన్య రావును చూడొచ్చు. తను రగ్డ్ లుక్‌తో స్క్రీన్‌ను సీరియస్‌గా చూస్తున్నాడు. వెనుక నుంచి ప్రొజెక్టర్ లైటింగ్ వస్తోంది. తన చూపుల్లోని ఇంటెన్సిటీ తన పాత్రలోని సీరియస్‌నెస్‌ను తెలియజేస్తోంది. కథలోని విషయాలను రివీల్ చేయకుండా , పాత్రలు వాటికి కావాల్సిన నిజాన్ని వెతుక్కుంటూ సాగే కథగా ఈ సినిమా ఉంటుందనే ఫీల్ కలుగుతుంది. ఈ విజువల్ శైలి క్రాంతి మాధవ్ సినిమా దృక్పథానికి దగ్గరగా ఉంది, అక్కడ స్టైల్ కన్నా భావోద్వేగాల నిజాయితీ, స్పష్టతకే ఎక్కువ ప్రాముఖ్యత కనిపిస్తోంది.
‘దిల్ దియా - ఏ నేక్డ్ ట్రూత్’ మూవీని పూర్ణ నాయుడు నిర్మిస్తుండగా శ్రీకాంత్ వి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. పి.జి.విందా సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి ఫణి కళ్యాణ్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. రా-షా (రవి-శశాంక్) ఎడిటర్‌గా, చిన్నా ప్రొడక్షన్ డిజైనర్‌గా, ధని ఏలే పబ్లిసిటీ డిజైనర్‌గా, స్టార్ సర్కిల్ డిజిటల్ మార్కెటింగ్, ఎస్.నాయుడు-ఫణి కందుకూరి (బియాండ్ మీడియా) పి.ఆర్ బాధ్యతలను నిర్వహిస్తున్నారు.
యువతను దృష్టిలో పెట్టుకొని, లోతైన భావోద్వేగాలతో కూడిన ప్రేమకథగా దిల్ దియా – ఏ నేక్డ్ ట్రూత్ మూవీ రూపొందుతోంది. ఆధునిక సంబంధాలను నిజాయితీగా, ఎలాంటి ఫిల్టర్ లేకుండా చూపించేలా సినిమా రూపొందుతోంది. ప్రేమతో పాటు భావోద్వేగాల సంక్లిష్టతను, వాటి వల్ల వచ్చే ఫలితాలు నేరుగా చూపిస్తూ, నేటి తెలుగు సినిమాలో సన్నిహితత్వానికి కొత్త అర్థాన్ని ఇచ్చేలా సినిమా తెరకెక్కుతోంది.
దర్శకుడి స్పష్టమైన విజన్, బలమైన క్రియేటివ్ సపోర్ట్‌తో ‘దిల్ దియా – ఏ నేక్డ్ ట్రూత్’ సినిమాను బాక్సాఫీస్‌కు కొత్త భాషను పరిచయం చేసే చిత్రంగా రూపొందిస్తున్నారు. ఈ సినిమా 2026 సమ్మర్లో థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

