Sandhya Raju: రామలింగ రాజు కోడలు సంధ్యా రాజు హీరోయిన్‌గా 'నాట్యం' సినిమా..

Sandhya Raju (tv5news.in)
Sandhya Raju: ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తున్న సినిమా 'నాట్యం'. క్లాసికల్ డ్యాన్స్‌పైన చిత్రాలు ఒకప్పుడు వచ్చేవి. వాటిని ప్రేక్షకులు కూడా బాగానే ఆదరించేవారు. ఒక కమర్షియల్ సినిమాకు వచ్చే పేరు, కలెక్షన్స్ వీటికి కూడా వచ్చేవి. కానీ పూర్తిగా ఒక క్లాసికల్ డ్యాన్స్ కథాంశంతో వచ్చిన సినిమాను ఆడియన్స్ తెరపై చూసి చాలాకాలమే అయ్యింది. అందుకే నాట్యం సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి.
నాట్యం సినిమాకు ఇంత హైప్ రావడానికి ఒక ముఖ్య కారణం.. అందులో హీరోయిన్ నిజంగానే క్లాసికల్ డ్యాన్సర్ అవ్వడం.. అందులోనూ తను తెలుగమ్మాయి అవ్వడం. అసలు ఎవరు ఈ సంధ్యా రాజు? అని చాలారోజుల నుండి ప్రేక్షకుల్లో ఒక ప్రశ్న మిగిలిపోయింది. సంధ్యా రాజు ఒక కూచిపూడి డ్యాన్సర్. రామ్‌కో ఇండస్ట్రీస్ చైర్మన్ పీ ఆర్ వెంకటరామరాజు కుమార్తె. ఆమె ప్రముఖ వ్యాపారవేత్త రామలింగ రాజు కుమారుడు రామరాజును పెళ్లాడింది.
మామూలుగా పెళ్లి తర్వాత ఒక ఆడపిల్ల ప్రొఫెషనల్ లైఫ్‌కు బ్రేకులు పడతాయంటారు.. కానీ సంధ్యా రాజు కెరీర్ మాత్రం పెళ్లి తర్వాతే మొదలయ్యింది. ముందుగా నాట్యం పేరుతో తెరకెక్కిన ఒక క్లాసికల్ షార్ట్ ఫిల్మ్‌లో హీరోయిన్‌గా నటించారు సంధ్యా రాజు. ఇప్పుడు ఫీచర్ ఫిల్మ్‌ను డైరెక్ట్ చేసిన రేవంత్ కోరుకొండే ఆ షార్ట్ ఫిల్మ్‌ను డైరెక్ట్ చేశారు. రేవంతే.. సంధ్యా రాజులోని నటిని ప్రేక్షకులకు పరిచయం చేశాడు.
నాట్యం షార్ట్ ఫిల్మ్ తర్వాత మొదటిసారి వెండితెరకు పరిచయమయ్యింది సంధ్యా రాజు. కానీ అది తెలుగులో కాదు.. మలయాళంలో. తెలుగు, కన్నడలో సూపర్ హిట్‌ను సాధించిన 'యూ టర్న్'ను మలయాళంలో రీమేక్ చేశారు దర్శకుడు వీ కే ప్రకాశ్. అందులో సంధ్యా రాజు హీరోయిన్‌గా నటించింది. ఆ సినిమా ప్రేక్షకులను బాగానే అలరించినా.. సంధ్యా రాజు మళ్లీ వెండితెరపై కనిపించలేదు.
ఇన్నాళ్ల తర్వాత మళ్లీ నాట్యంతో మన ముందుకు వస్తున్నారు సంధ్యా రాజు. ఒక డ్యాన్సర్‌గా ఎన్నో ఒడిదుడుకులు ఎదురైనా ఆమె హీరోయిన్‌గా మూవీ లవర్స్‌ను ఇంప్రెస్ చేయడానికి వచ్చేస్తున్నారు. ఇక నాట్యం సినిమాకు దర్వకత్వం వహించిన రేవంత్ కొరుకొండ తన కెరీర్‌ను క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ప్రారంభించాడు. పలు షార్ట్ ఫిల్మ్స్, ఫీచర్ ఫిల్మ్స్‌తో నటుడిగా మెప్పించిన రేవంత్ దర్శకుడిగా స్క్రీన్‌పైన తన మ్యాజిక్‌ను చూపించనున్నాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com