RTC X Roads Cinema Theaters : సంధ్య థియేటర్స్ కనుమరుగు కానున్నాయా

RTC X Roads Cinema Theaters :  సంధ్య థియేటర్స్ కనుమరుగు కానున్నాయా
X

ఏ నగరంలో అయినా సినిమాలకు సంబంధించి ఒక అడ్డా ఉంటుంది. ఒకప్పుడు హైదరాబాద్ కు ఆ అడ్డా. ఆర్టీసీ క్రాస్ రోడ్స్. అసలు ఆర్టీసీ క్రాస్ రోడ్స్ అంటే గుర్తొచ్చేదే లెక్కకు మించి కనిపించే సినిమా థియేటర్స్. ఇక్కడ ఫలానా థియేటర్ ఫలానా హీరోకు సెంటిమెంట్ అంటూ చెప్పుకున్నారు. సుదర్శన్ అంటే కృష్ణ, మహేష్ బాబు ఫ్యాన్స్ కు సెంటిమెంట్. సంధ్య థియేటర్స్ మెగా స్టార్ కు సెంటిమెంట్. ఈ క్రాస్ లో సంధ్య 35 ఎమ్ఎమ్, సంధ్య 70ఎమ్ఎమ్, ఓడియన్, ఓడియన్ మినీ, సుదర్శన్, దేవి, మయూరి, సప్తగిరి, ఉషా మయూరితో పాటు చుట్టుపక్కల రెండు మూడు కిలోమీటర్ల లోపే దాదాపు 15 వరకూ థియేటర్స్ ఉండేవి. అయినా అన్నిటికి సెంటర్ పాయింట్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్. ఇప్పుడంటే స్టార్స్ అంతా ఐమాక్స్ కు వెళుతున్నారు. కానీ ఒకప్పుడు ఆడియన్స్ ను మీట్ అవడం అంటే ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో తమ సినిమాలు ప్రదర్శితమవుతున్న థియేటర్స్ లోనే. కొందరు ఇప్పటికీ ఇది ఫాలో అవుతున్నారు. అలాంటి థియేటర్స్ మల్టీప్లెక్స్ లు వచ్చిన తర్వాత కాస్త కళ తగ్గాయి. ఇక్కడ ప్రస్తుతం ఐదు థియేటర్స్ మాత్రమే ఉన్నాయి. వీటిలో సుదర్శన్ థియేటర్స్ కూడా త్వరలోనే మల్టీ ప్లెక్స్ లుగా మారబోతున్నాయి. అటు ఓడియన్ ను ఎప్పుడో కూల్చేశారు. అక్కడా మల్టీ ప్లెక్స్ రెడీ అవుతోంది. సప్తగిరి చిన్న సినిమాలకు మాత్రమే పరిమితం అయింది. దీంతో ఇప్పుడు అందరి దృష్టీ సంధ్య థియేటర్స్ పైనే ఉంది.

సంధ్య థియేటర్స్ రెండు ఉన్నాయి. కాస్త ఇరుకుగానే కనిపిస్తుందీ థియేటర్. ఒకప్పుడు ఏమో కానీ.. మెట్రోవచ్చిన తర్వాత మరీ ఇరుకై పోయింది. పోనీ ఇక్కడ మల్టీ ప్లెక్స్ కడతారా అంటే అంత స్పేస్ ఉండదు. ఒకవేళ సింగిల్ స్క్రీన్స్ గా ఉండాలంటే.. చట్టూ మల్టీ ప్లెక్స్ లు వచ్చిన తర్వాత ఈ సింగిల్ స్క్రీన్స్ వైపు జనం చూస్తారా అనేదీ పాయింట్ అయితే.. ఈ రెండు సింగిల్ స్క్రీన్స్ లో కూడా సౌండ్ సిస్టమ్ యావరేజ్ గానే ఉంటుంది. సుదర్శన్, దేవిలతో పోలిస్తే సంధ్య థియేటర్స్ టెక్నికల్ గా చాలా వీక్ గా కనిపిస్తాయి. మొత్తంగా ఒకప్పటి సింగిల్ స్క్రీన్ థియేటర్స్ అడ్డా త్వరలోనే మల్టీ ప్లెక్స్ ల పాయింట్ గా మారబోతోంది. తరుణంలో సంధ్య థియేటర్స్ మనుగడ ప్రశ్నార్థకం కానుందా అని సినీ అభిమానులు చర్చించుకుంటున్నారు.

Tags

Next Story