సమంత యాడ్‌‌ను మెచ్చిన సానియా..

సమంత యాడ్‌‌ను మెచ్చిన సానియా..
భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా మహిళగా తనకు ఎదురైన అనుభవాల గురించి నెట్‌లో పోస్ట్‌ పెట్టింది.

భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా మహిళగా తనకు ఎదురైన అనుభవాల గురించి నెట్‌లో సుదీర్ఘమైన పోస్ట్‌ పెట్టింది. తాజాగా సినీ నటి సమంత నటించిన ఓ యాడ్ చూసి ఆమె ఇలా స్పందించింది. మన చుట్టూ ఉన్న వ్యక్తులు మహిళలు ధరించే దుస్తులు, భాగస్వామిని ఎంచుకోవడం వంటి అనేక విషయాలలో తమ అభిప్రాయాలను అమ్మాయిలపై రుద్దడానికి ప్రయత్నిస్తారు. వాటిని దాటవేస్తూ తనకు నచ్చిన విధంగా జీవించాలనుకుంటున్నట్లు ఆ యాడ్ చూపుతోంది.

“ఈ యాడ్ చూసిన తర్వాత నా చుట్టూ ఎన్నో జ్ఞాపకాలు చుట్టుముట్టాయి. 'ఒక టెన్నిస్ క్రీడాకారిణి ఏం సాధిస్తుంది? ఇది మహిళల ఆట కాదు. ఆమె ఎంత దూరం వెళ్ళగలదు?' అనే మాటలు నా కెరీర్‌లో చాలాసార్లు వినాల్సి వచ్చేది. కానీ నేను నా కలను సాకారం చేసుకోవడానికి నిరంతరం ప్రయత్నించేదానిని. నాపైన నాకు నమ్మకం ఉండేది. సమాజం గురించి పట్టించుకోలేదు. విజయం సాధించాలనే సంకల్పం ముందు అవేవీ నా చెవికి ఎక్కలేదు. సమంత నటించిన ఈ యాడ్ తమ కలలను సాకారం చేసుకోవాలనుకునే మహిళలకు స్ఫూర్తిదాయకమని సానియా రాసింది.

సానియా నాలుగేళ్ల నుంచి క్రీడలపై మక్కువ చూపింది. ఆమెకు ఆరేళ్ల వయసున్నప్పుడు టెన్నిస్ బ్యాట్ పట్టింది. 16 ఏళ్ల వయసులో ప్రొఫెషనల్ టెన్నిస్‌లోకి ప్రవేశించిన ఆమె.. చాలా కాలం పాటు కెరీర్‌ను కొనసాగించింది. ఆమె 2010లో షోయబ్‌ను వివాహం చేసుకుంది. వీరికి ఒక కుమారుడు ఉన్నాడు.

Tags

Read MoreRead Less
Next Story