Sania Mirza Divorce: విడాకులపై మళ్లీ పుట్టుకొస్తున్న పుకార్లు

Sania Mirza Divorce: విడాకులపై మళ్లీ పుట్టుకొస్తున్న పుకార్లు
X
ఇన్ స్టా బయో ఛేంజ్ చేసిన షోయబ్.. విడాకుల పుకార్లు నిజమేనా..?

భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, ఆమె భర్త పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ ల విడాకులపై కొంతకాలం నుంచి సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరుగుతోంది. ఈ విషయంపై షోయబ్ గానీ, సానియా గానీ ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి ప్రకటనా విడుదల చేయలేదు, ఎక్కడా ప్రస్తావించలేదు. అయితే గత ఏడాది నవంబర్ నుండి సానియా సోషల్ మీడియాలో చేస్తోన్న కొన్ని పోస్ట్‌లు మరిన్ని సందేహాలు రేకెత్తేలా చేస్తున్నాయి. ఇప్పుడు, మాజీ క్రికెట్ కెప్టెన్ తన ఇన్‌స్టాగ్రామ్ బయోని మార్చి మరో షాక్ ఇచ్చారు. దీంతో వీరి విడాకులపై వచ్చిన పుకార్లు మరోసారి చిచ్చు రాజేసుకున్నాయి.

అప్పట్లో షోయబ్, సానియాలు వివాహంపై పలువురు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఓ పాకిస్థానీ అబ్బాయిని పెళ్లి చేసుకోవడమేంటని మండిపడ్డారు. అనేక విమర్శలు చేశారు. అయితే ఇటీవలి కాలంలో వీరిద్దరూ విడాకులు తీసుకుంటున్నారన్న వార్తల నేపథ్యంలో తాజాగా సోయబ్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో బయోను ఛేంజ్ చేశారు. ఇంతకుముందు "సూపర్ ఉమెన్ హస్బెండ్ @మీర్జాసానియర్" అని ఉండగా.. ఇప్పుడు కొత్తగా చేర్చిన బయోలో ఇతర వివరాలతో పాటుగా “ఫాదర్ టు వన్ ట్రూ బ్లెస్సింగ్” అని మాత్రమే ఉండడం కనిపిస్తోంది. దీంతో ఈ జంట విడాకుల వరకు వెళ్లారన్న వార్తలకు మరింత ఆజ్యం పోసినట్టుగా ఉందని అభిమానులు ఆందోళన చెందుతున్నారు

సానియా మీర్జా, షోయబ్ మాలిక్ 12 ఏప్రిల్ 2010న భారతదేశంలోని హైదరాబాద్‌లో ముస్లిం సంప్రదాయం ప్రకారం వివాహం చేసుకున్నారు. వారు పాకిస్తాన్‌లోని సియాల్‌కోట్‌లో వలీమా వేడుకను కూడా చేసుకున్నారు. ఈ జంట తమ మొదటి బిడ్డ ఇజాన్‌కు 2018లో జన్మనిచ్చారు.


చట్టపరమైన విషయాలను పరిష్కరించుకున్న తర్వాత షోయబ్, సానియా విడివిడిగా జీవిస్తున్నారని, వారి కుమారుడికి సహ-తల్లిదండ్రులుగా ఉన్నారని ఇటీవలి కాలంలో పలు కథనాలు వర్గాలు వెలువడ్డాయి. ఈ పుకార్లు నవంబర్ 2022 నుంచి ప్రారంభమయ్యాయి. కొన్ని సోషల్ మీడియా పోస్ట్‌లు కూడా ఈ జంట విడాకులు తీసుకోబోతున్నారన్నట్టు రాసుకువచ్చాయి. అయినప్పటికీ, వీరిద్దరిలో ఏ ఒక్కరూ ఈ విషయంపై పెదవి విప్పలేదు.

షోయబ్, పాకిస్థానీ నటి అయేషా ఒమర్ ఒక మ్యాగజైన్ ఫోటోషూట్‌లో కలిసి పనిచేసిన తర్వాత వారిద్దరూ రిలేషన్ షిప్ లో ఉన్నారని కొన్ని పుకార్లు వచ్చాయి. అయితే, ఆ నివేదికలను అయేషా కొట్టిపారేసింది. పెళ్లయిన వ్యక్తి పట్ల తాను ఎప్పటికీ ఆకర్షించబడనని స్పష్టం చేసింది. "నేను పెళ్లయిన లేదా నిబద్ధత కలిగిన వ్యక్తి పట్ల ఎప్పటికీ ఆకర్షితుడవను. నా గురించి అందరికీ తెలుసు... అది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు" అని ఆమె క్లారిటీ ఇచ్చింది.


Tags

Next Story