Sanjay Dutt:'అందుకే డ్రగ్స్ అలవాటు చేసుకున్నా'.. షాకింగ్ విషయం బయటపెట్టిన నటుడు

Sanjay Dutt (tv5news.in)
Sanjay Dutt: యశ్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో తెరకెక్కిన 'కేజీఎఫ్ 2'.. పాన్ ఇండియా చిత్రాల్లోనే కొత్త రికార్డ్ సృష్టిస్తూ వెళ్తోంది. ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించడంతో పాటు కలెక్షన్ల విషయంలోనూ ఫుల్ స్పీడ్‌లో దూసుకుపోతోంది. అయితే ఈ సినిమాతో సౌత్ ప్రేక్షకులను నేరుగా పలకరించాడు బాలీవుడ్ సీనియర్ నటుడు సంజయ్ దత్. కేజీఎఫ్ చాప్టర్ 2 ప్రమోషన్స్‌లో పాల్గొంటున్న సమయంలో మరోసారి తన డ్రగ్స్ అడిక్షన్ గురించి ప్రేక్షకులతో పంచుకున్నాడు సంజయ్.
బాలీవుడ్‌లో ఎంతోకాలంగా హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, విలన్‌గా నటిస్తూ మెప్పిస్తున్న సంజయ్ దత్ తొలిసారి సౌత్ ప్రేక్షకులను నేరుగా పలకరించాడు. సౌత్‌లో కూడా సంజయ్ నటనకు ఫ్యాన్స్ ఉన్నారు. అయితే సంజయ్‌కు ఒకప్పుడు డ్రగ్స్ అడిక్షన్ ఉండేదని.. అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ విషయంపై చాలా రోజుల తర్వాత నోరువిప్పాడు సంజయ్.
కేవలం అమ్మాయిలతో మాట్లాడడానికే తాను డ్రగ్స్‌కు అలవాటు పడ్డానని షాకింగ్ విషయాన్ని బయటపెట్టాడు సంజయ్ దత్. ఆ రోజుల్లో అమ్మాయిలతో మాట్లాడడానికి చాలా సిగ్గుపడేవాడట సంజయ్. అయితే డ్రగ్స్ వల్ల అమ్మాయిలతో మాట్లాడే ధైర్యం వస్తుందని, కూల్‌గా కనిపిస్తాననే అనే అపోహతో డ్రగ్స్ వాడడం మొదలుపెట్టాడట సంజయ్ దత్. ఆ తర్వాత డ్రగ్స్‌కు దూరమయ్యేందుకు సంజయ్ దత్ కొన్నాళ్లు రిహాబిలిటేషన్ సెంటర్‌లో గడిపాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com