Sanjay Dutt: క్యాన్సర్ అని తెలిసి ట్రీట్‌మెంట్ తీసుకోనని చెప్పా: సంజయ్ దత్

Sanjay Dutt: క్యాన్సర్ మనిషిని పీల్చి పిప్పి చేస్తుంది.. మొదటి స్టేజ్‌లోనే గుర్తించి ట్రీట్‌మెంట్ తీసుకుంటే త్వరగా రికవరవుతారు.. అయితే మనోధైర్యమే సగం మందు అని డాక్టర్లు వివరిస్తుంటారు. ఎంత ఆధునిక వైద్యం అందుబాటులో ఉన్నా ధైర్యంగా ఉంటూ ట్రీట్‌మెంట్‌కి సహకరిస్తే వ్యాధి నుంచి పూర్తిగా బయటపడొచ్చు. కృంగిపోతే మందులు పనిచేయవు. సాధారణ మనుషుల్లానే జీవిస్తే రోజువారీ కార్యకలాపాలు యధావిధిగా చేసుకోవచ్చు. సినీ తారలు చాలా మంది క్యాన్సర్ బారిన పడి చికిత్స తీసుకుని మళ్లీ నటిస్తున్న నాయికలు కూడా ఉన్నారు. అందులో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కూడా ఒకరు.
తన క్యాన్సర్ నిర్ధారణ గురించి సంజయ్ ఇటీవల ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ.. "నాకు వెన్నునొప్పి ఉంది. ఒక రోజు నేను ఊపిరి కూడా పీల్చుకోలేకపోయాను. వేడి నీటితో కాపడం, నొప్పిని తగ్గించే మందులు వేసుకోవడం చేశాను. అయినా ఉపశమనం లేదు.. దాంతో ఆసుపత్రికి వెళ్లాను. ఆ సమయంలో నా భార్య, నా సోదరీమణులు ఎవరూ నా చుట్టూ లేరు. నేను ఆస్పత్రిలో ఒంటరిగా ఉన్నాను. అకస్మాత్తుగా ఓ వ్యక్తి వచ్చి 'నీకు క్యాన్సర్' అని చెప్పాడు.
తన పరిస్థితి గురించి తెలుసుకున్న తర్వాత, కీమోథెరపీ తీసుకోవడం కంటే చనిపోవడమే మంచిది అని అనుకున్నాడట. ఇలాంటివి వింటే జీవితం మొత్తం కళ్ల ముందు కనబడుతుంది. నాకు క్యాన్సర్ చరిత్ర ఉంది. కుటుంబంలో మా అమ్మ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్‌తో మరణించింది. నా భార్య (రిచా శర్మ) బ్రెయిన్ క్యాన్సర్‌తో మరణించింది. కాబట్టి, నేను డాక్టర్‌కి మొదట చెప్పిన విషయం ఏమిటంటే, నేను కీమోథెరపీ తీసుకోనక్కర్లేదు. నేను చనిపోవాలని అనుకుంటే చనిపోతాను. నాకు ఎలాంటి చికిత్స అక్కర్లేదు." అని చెప్పాను.
నటుడు సంజయ్ దత్ ఇటీవలే 2020లో షంషేరా చిత్రం షూటింగ్‌లో ఉన్నప్పుడు తన ఊపిరితిత్తుల క్యాన్సర్ నిర్ధారణ గురించి వెల్లడించారు. తన పక్కన కుటుంబ సభ్యులెవరూ లేకపోవడంతో క్యాన్సర్ వార్తను ఎవరితో పంచుకోలేదని చెప్పాడు.
కేజీఎప్2 సినిమాలో చేస్తున్నప్పడు షూటింగ్ సమయంలో కీమో తీసుకుంటూనే నటించాడు. తన భార్య, తన సోదరీమణుల ప్రోత్సాహంతో కీమోలు చేయించుకుంటూ సినిమాల్లో అవకాశాలు అందిపుచ్చుకుంటున్నాడు. తన పాత్రకు న్యాయం చేస్తున్నాడు. వ్యాయామాలు చేస్తూ ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకుంటూ క్యాన్సర్‌ని జయించే ప్రయత్నం చేస్తున్నాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com