అందమైన అమలతో నా మొదటి ఫోటోషూట్: సంజయ్ కపూర్

బాలీవుడ్ నటుడు సంజయ్ కపూర్ గురువారం ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక ప్రత్యేక పోస్ట్‌ను షేర్ చేసి బాలీవుడ్ అభిమానులను ఆనందపరిచారు. ఈ చిత్రం నటుడి మొట్టమొదటి ఫోటోషూట్ నుండి వచ్చింది. ముంబైలోని మాద్ ద్వీపంలో క్లిక్ చేసిన ఫోటో 1987 నాటిది. ఫోటోలో అతను నటి అమల అక్కినేనితో కలిసి పోజులిచ్చాడు. సంజయ్ కపూర్ క్యాప్షన్‌లో, అమల తన మొదటి సహనటి అని, అయితే దురదృష్టవశాత్తు ఆ చిత్రం హిట్ అవ్వలేదని పేర్కొన్నాడు. "అందమైన, ప్రతిభావంతురాలైన అమలతో నా మొదటి ఫోటో షూట్. ఈ చిత్రం ఓ తియ్యని జ్ఞాపకం అని పోస్ట్ లో పేర్కొన్నారు.
నటుడు నాగార్జునను వివాహం చేసుకున్న అమల అక్కినేని, ప్రముఖ చిత్రనిర్మాత T. రాజేందర్ దర్శకత్వం వహించిన 'మైథిలి యెన్నై కడలి' అనే తమిళ చిత్రంతో తన నటనా జీవితాన్ని ప్రారంభించారు. సంజయ్ కపూర్‌తో ఆమె ఫోటోషూట్ చేయడానికి ఒక సంవత్సరం ముందు ఈ చిత్రం 1986లో విడుదలైంది. ఈ పోస్ట్‌పై సంజయ్ కపూర్ భార్య మహీప్ కపూర్ స్పందిస్తూ, ఈ ఫోటోషూట్ సమయంలో తన వయస్సు కేవలం 14 సంవత్సరాలు అని రాసింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com