Sanjjanaa Galrani : విడాకుల పై క్లారిటీ ఇచ్చిన సంజన..!

Sanjjanaa Galrani : సినిమాల కంటే ఎక్కువగా వివాదాలతోనే వార్తల్లో నిలుస్తూ వచ్చింది కన్నడ నటి సంజనా గల్రానీ.. ప్రభాస్ బుజ్జిగాడు సినిమాతో టాలీవుడ్‌లో మెరిసిన సంజన ఆ తర్వాత పలు చిత్రాల్లో సహా నటిగా, హీరోయిన్‌గా మెప్పించింది. అయితే ఆ మధ్య శాండల్‌వుడ్ డ్రగ్స్ కేసులో చిక్కుకొని జైలుకి వెళ్ళింది. అమెకి షరతులతో కూడిన బెయిల్‌ని మంజూరు చేయడంతో బయటకు వచ్చి తన చిరకాల మిత్రుడు, ప్రియుడు డాక్టర్ పాషాను వివాహం చేసుకుంది.
ఆ తర్వాత మీడియాకి, సినిమాలకి దూరంగా ఉంటూ వస్తోంది సంజన.. ఈ క్రమంలో సంజన ప్రెగ్నెంట్ అని తెలిసింది. ప్రస్తుతం సంజన అయిదు నెలల గర్భవతి..ఇదిలావుండగా సంజనకు సంబంధించిన మరో ఆసక్తికర విషయం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే.. తన భర్తతో సంజనకి మనస్పర్ధలు వచ్చాయని, ఆమె తన భర్తకి విడాకులు ఇవ్వబోతుందంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది.
అయితే దీనిపైన సంజన చాలా ఘాటుగా స్పందించింది. ప్రస్తుతం తన వైవాహిక జీవితం చాలా బాగుందని, ఆధారాలు లేని వార్తలు సృష్టించందని, ఇలా చేసిన వారి పైన చట్టపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించింది. సంజనకు నటనపైనే కాదు యోగాపై కూడా ఆసక్తి ఎక్కువ. యోగా ట్రైనింగ్ సెంటర్ ద్వారా చాలా మందికి యోగా నేర్పుతోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com