Chiranjeevi : చిరంజీవికీ సంక్రాంతి టైటిలేనా..

బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ఇప్పుడు స్టార్ డైరెక్టర్స్ లిస్ట్ లోకి ఎంటర్ అయ్యాడు. సంక్రాంతికి వస్తున్నాంతో ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన అనిల్ రావిపూడి అంటే ఎంటర్టైన్మెంట్ కు కేరాఫ్ గా మారాడు. ఒకప్పుడు ఇవివి సత్యనారాయణలాగా అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటూనే వినోదానికి పెద్ద పీట వేస్తూ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్స్ కొడుతూ తన నిర్మాతల కళ్లల్లో ఆనందాన్ని చూడటం వ్యసనంగా మార్చుకున్నాడు. సంక్రాంతికి వస్తున్నాం తర్వాత మెగాస్టార్ చిరంజీవి ఛాన్స్ ఇచ్చాడు అంటేనే అర్థం చేసుకోవచ్చు.. ఇతని కామెడీని ఆయనెంత ఇష్టపడుతున్నాడో చెప్పడానికి.
త్వరలోనే చిరంజీవి - అనిల్ రావిపూడి కాంబినేషన్ లో సినిమా స్టార్ట్ కాబోతోంది. జానర్ ఏదైనా ఎంటర్టైన్మెంట్ పక్కా అంటున్నాడు అనిల్. పైగా కామెడీ టైమింగ్ లో మెగాస్టార్ గురించి కొత్తగా చెప్పేదేముందీ.. ఓ రేంజ్ లో అదరగొడతాడు. అందుకే వినోదం గ్యారెంటీ అంటున్నారు. అయితే ఈ చిత్రానికి ఓ వెరైటీ పెట్టబోతున్నాడట అనిల్. ప్రస్తుతానికి రూమర్ అయినా.. ఇదే నిజం కావొచ్చు అనేది మెజారిటీ పీపుల్ ఒపీనియన్.
‘‘సంక్రాంతి అల్లుడు’’.. ఇదీ చిరంజీవి, అనిల్ కాంబోలో వచ్చే సినిమా టైటిల్ అంటున్నారు. ఇందులో నిజమెంత అనేది తెలియదు కానీ.. నిజంగానే టైటిల్ అదిరిపోయింది. ఇలాంటి టైటిల్స్ అంటే మెగాస్టార్ కు భలే సెట్ అవుతాయి. ఈ టైటిల్ వినగానే రౌడీ అల్లుడు లాంటి మాస్ ఎంటర్టైనర్ గుర్తొస్తుంది. అందుకే ఈ టైటిల్ ఈ కాంబోకు పర్ఫెక్ట్ గా సెట్ అవుతుందంటున్నారు. మరి టైటిల్ ఇదేనా లేక ఇంకేదైనానా అనేది అనిల్ చెబితేనే యాప్ట్ గా ఉంటుందేమో.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com