Venkatesh : సైంధవ్ డే మళ్లీ ఈ సంక్రాంతికీ వస్తున్నాడు

Venkatesh :  సైంధవ్ డే మళ్లీ ఈ సంక్రాంతికీ వస్తున్నాడు
X

వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో సినిమా అంటే మాగ్జిమం ఎంటర్టైన్మెంట్ ఎక్స్ పెక్ట్ చేస్తాం. కాకపోతే ఆ వినోదం రొటీన్ గా ఉండకుంటా ఉంటే చాలు అనుకుంటాం. ఎఫ్ 2, ఎఫ్ 3 తర్వాత ఈ కాంబోలో మరోసారి సినిమా అంటే ఖచ్చితంగా అంచనాలు పెద్దగానే ఉంటాయి. బట్ తాజాగా వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం ట్రైలర్ చూస్తే.. 'వెంకటేష్ కు మరో సైంధవ్ లాంటి మూవీ అవబోతోంది అనిపిస్తే తప్పేం లేదు.అనిల్ నుంచి భార్యలపై సెటైర్స్ వేయడం అనే రొటీన్ రొడ్డకొట్టుకు మించి ఇంకేం ఆశించొద్దు అని వార్నింగ్ లా ఉంది. అతని అన్ని సినిమాల్లానే ఇది కూడా చాలా చిన్న పాయింట్ చుట్టూ అల్లుకున్న సిల్లీ డ్రామాలా కనిపిస్తోంది. ట్రైలర్ చూశాక సింపుల్ గా అనిపించేది ఏంటంటే.. 'ఒకానొక బిగ్ షాట్ కిడ్నాప్ కావడం.. అతన్ని కాపాడకపోతే ప్రభుత్వం పడిపోతుందని ఓ సీక్రెట్ ఆపరేషన్ కోసం మాజీ పోలీస్ ను రంగంలోకి దించడం.. అతనేమో పెళ్లాంతో సహా ఆపరేషన్ లో పాల్గొనడం.." ఇంతే. ఈ క్రమంలో పెళ్లాం, ప్రియురాలు మధ్య నలిగిపోయే హీరో అంటూ అదే వాట్సాప్ కుళ్లు జోకులు తప్ప మినిమం కొత్తదనం కనిపించలేదీ ట్రైలర్లో.అసలు ఒక వ్యక్తి కిడ్నాప్ కే ప్రభుత్వం పడిపోవడం అనేదే చెత్త థాట్. దాని చుట్టూ సినిమా అంతా నడిపించాలనుకోవడం అంటే ఇంకెంత టార్చర్ ఉండబోతోందో అర్థం చేసుకోవచ్చు.

అప్పుడెప్పుడో వెంకటేష్ చేసిన ఇంట్లో ఇల్లాలు వంటిట్లో ప్రియురాలు తరహాలో.. ఇంట్లో ఇల్లాలు పోలీస్ స్టేషన్ లో ప్రియురాలు అన్నట్టుగా ఉంది. ఆ సినిమాలో అద్భుతమైన ఎమోషన్స్ ఉంటాయి. ఈ ట్రైలర్ చూస్తే అర్థం పర్థం లేని అడ్డగోలు జోకులతో అదే పనిగా భార్యలనో, ఆడవారినో డీ గ్రేడ్ చేస్తూ దర్శకుడు తన పైత్యాన్ని ప్రదర్శించిన వైనం కనిపిస్తోంది. దీనికంటే జబర్దస్త్ లో వచ్చే పెళ్లాం మీది జోకులు బెటర్ అనేంత దిగువ స్థాయి రైటింగ్ ట్రైలర్లోనే కనిపిస్తోందంటే ఇంక చెప్పేదేముందీ.. దిల్ రాజు బ్యానర్ కు మరో డిజాస్టర్ రెడీ అయిందనీ.. అదీ పండగ రోజే షాక్ ఇవ్వబోతోందని.

ఏదో పాటలు హిట్ అయ్యాయి కాబట్టి సినిమా హిట్ అవుతుందని ఎక్కడా లేదు. అసలు సినిమా రేంజ్ ను తెలిపే ట్రైలర్ పూర్తిగా తేలిపోయిన తర్వాత ఆ పాటలను యూ ట్యూబ్ లో చూసుకుంటారు.ఆ వ్యూస్ ను ఇన్ని మిలియన్స్ వచ్చాయి అని మళ్లీ జబ్బలు చరుచుకుంటారు మేకర్స్. సింపుల్ గా చెబితే వెంకటేష్ గత సంక్రాంతికి సైంధవ్ అనే సినిమాతో వచ్చాడు. ఆ మూవీ అతని కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్. ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం ట్రైలర్ చూసిన తర్వాత ఈ సంక్రాంతికీ వెంకీ మరో సైంధవ్ డు కాబోతున్నాడు అని ఖచ్చితంగా అనిపిస్తోంది.

పాపం వెంకటేష్.. ఎఫ్ 2 హిట్ అయిందని ఎఫ్ 3 చేశాడు. అది యావరేజ్ అయింది. సంక్రాంతికి వస్తున్నాంతో అతను సైంధవ్ రిజల్ట్ నే చూడబోతున్నాడు. అనిల్ రావిపూడి కంటే కూడా ఇది దిల్ రాజుకు పండగ పూట పెద్ద ఎదురుదెబ్బగా నిలవబోతోందని స్పష్టంగా తెలుస్తోంది.

Tags

Next Story