Venkatesh : మూడు రోజుల్లోనే బాక్సాఫీస్ ను షేక్ చేసిన వెంకీ

సంక్రాంతి విన్నర్ ఎవరు అని అంతా ఎవరినైతే ప్రిడిక్ట్ చేశారో అతనే విన్నర్ అయ్యాడు. యస్.. ఈ సంక్రాంతికి విక్టరీ వెంకటేష్ బాక్సాఫీస్ విజేతగా నిలిచాడు. చూసిన ప్రతి ఒక్కరూ పర్ఫెక్ట్ సంక్రాంతి ఎంటర్టైనర్ అనేశారు. మరి కంప్లీట్ ఫ్యామిలీ మూవీ అంటే ఆడియన్స్ ఆగుతారా.. మిగతా రెండు సినిమాల కంటే ఈ మూవీకే ఎక్కువ టికెట్స్ తెగిపోతున్నాయి. అందుకే మూడు రోజుల్లోనే వెంకటేష్ కెరీర్ లోనే ఎప్పుడూ లేనంతగా వసూళ్లు వస్తున్నాయి. ఆయన కెరీర్ లో ఇదో రికార్డ్ కూడా.
అనిల్ రావిపూడి డైరెక్షన్ లో ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా, బుల్లిరాజు పాత్ర హైలెట్ గా వినోదమే ప్రధానంగా రూపొందిన ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించాడు. ఓ వైపు ఆయనే నిర్మించిన గేమ్ ఛేంజర రకరకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నా.. ఈ చిత్రం మాత్రం ఆయన బ్యానర్ కు నవ్వులు పూయించింది. కేవలం మూడు రోజుల్లోనే ఏకంగా 100 కోట్ల క్లబ్ లో చేరింది సంక్రాంతికి వస్తున్నాం. ఇప్పటికే విడుదలైన అన్ని చోట్లా బ్రేక్ ఈవెన్ అయిపోయింది. ఇక లాభాలే.ఇదీ కాక నాన్ థియేట్రికల్ పూర్తిగా లాభంగా మారబోతోంది.
మరోవైపు నార్త్ అమెరికాలో కూడా ఒన్ మిలియన్ క్లబ్ లోకి ఎంటర్ అయింది సంక్రాంతికి వస్తున్నాం. ఇంతకు ముందు వెంకీ నటించిన మూడు సినిమాలు ఒన్ మిలియన్ క్లబ్ లో ఉన్నాయి. అయితే ఇదే ఫాస్టెస్ట్ ఒన్. అత్యంత వేగంగా ఒన్ మిలియన్ క్లబ్ లోకి చేరిందీ మూవీ. ఏదేమైనా సంక్రాంతి వంటి సీజన్స్ లో యాక్షన్ మూవీస్ కంటే ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ అయితేనే ఆడియన్స్ బెస్ట్ ఛాయిస్ గా భావిస్తారని మరోసారి ప్రూవ్ అయింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com