Sankranthiki Vastunnam : సంక్రాంతికి వస్తున్నాంను బలగంగా మార్చేశారు

విక్టరీ వెంకటేష్ విజయయాత్ర కొనసాగుతూనే ఉంది. సంక్రాంతికి వస్తున్నాం మూవీ 200 కోట్ల క్లబ్ లోకి ఎంటర్ అయింది. ఆల్రెడీ 100 కోట్ల షేర్ అనే వాల్ పోస్టర్ ఎంటైర్ ఇండస్ట్రీని సర్ ప్రైజ్ చేసింది. ఓ సాధారణ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఈ రేంజ్ లో విజయం సాధించడం అంటే తెలుగు వాళ్లు కామెడీ సినిమాలను ఎంత మిస్ అవుతున్నారో తెలియజేస్తోంది. అయితే ఈ నిర్మాత దిల్ రాజు సంక్రాంతికి వస్తున్నాం బ్లాక్ బస్టర్ అయిందని పట్టించకోవడం లేదేమో కానీ..అతని గేమ్ ఛేంజర్ మాత్రమే కాదు.. ఈ చిత్రాన్నీ పైరసీ చేశారు. చాలా చోట్ల సంక్రాంతికి వస్తున్నాం క్లాలిటీ ప్రింట్స్ తో కనిపిస్తోంది. నిజానికి థియేటర్స్ లో చూడనివాళ్లే కాదు.. చూసిన వాళ్లు కూడా మళ్లీ ఈ ప్రింట్ చూసి ఎంజాయ్ చేస్తున్నారు.
గేమ్ ఛేంజర్ పైరసీ విషయంలో కనిపించిన హడావిడీ ఈ చిత్రానికి కనిపించడం లేదు. ఎవరు చేశారు. ఎందుకు చేశారు అనే క్లూస్ పెద్దగా ఉండవు. ఎందుకంటే వెంకీ ఎవరికీ పోటీ కాదు. అతని సినిమాను డ్యామేజ్ చేయడం ద్వారా ఎవరికీ లాభం లేదు. అందుకే నిర్మాతలు లైట్ తీసుకున్నారేమో కానీ.. ఆ మధ్య బలగం సినిమాను ఎలాగైతే గ్రామాల్లో పెద్ద టివిలు పెట్టుకుని వీధి వీధంతా చూశారో.. ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాంను కూడా అలాగే పైరసీ ప్రింట్స్ ను కొన్ని గ్రామాల్లో ప్రదర్శిస్తున్నారు. దీన్ని జనాలు వీధిలో కూర్చుని 'ఫ్రీ'గా ఎంజాయ్ చేస్తున్నారు. ఓ రకంగా రాబోయే పెద్ద సినిమాలన్నిటికీ ఇదో పెద్ద వార్నింగ్ అనే అనుకోవచ్చు. ఏదో.. ఓటిటిలు వచ్చాక పైరసీలు తగ్గాయి అనుకున్నారు కానీ.. అలాంటిదేం లేదు అని ఈ సంక్రాంతి మూవీస్ చెబుతున్నాయి. అన్నట్టు డాకూ మహారాజ్ పరిస్థితి కూడా ఇంతే క్వాలిటీతో బయట కనిపిస్తోంది. మరి దీనికి పటిష్టమైన చర్యలు తీసుకోకపోతే పరిశ్రమ మనుగడకే పెద్ద దెబ్బ అవుతుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com