Sankranti 17 Years : 17ఏళ్ల సంక్రాంతి.. శ్రీకాంత్ పాత్రకి ముందుగా అనుకున్న హీరో ఎవరంటే?

Sankranti 17 Years : వెంకటేష్, శ్రీకాంత్, శివబాలాజీ, శర్వానంద్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం సంక్రాంతి.. 2001 తమిళంలో వచ్చిన ఆనందం సినిమాకి ఇది రీమేక్. ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రానికి ముప్పలనేని శివ దర్శకత్వం వహించగా, సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్ పైన ఆర్. బి. చౌదరి ఈ చిత్రాన్ని నిర్మించారు. 18 ఫిబ్రవరి 2005లో విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్న ఈ చిత్రానికి నేటితో 17 ఏళ్ళు పూర్తి అయ్యాయి.
అయితే ఈ సినిమాలో విష్ణు పాత్రను చేయడానికి ముందుగా హీరో శ్రీకాంత్ ఆసక్తిని చూపించలేదట... ఈ సినిమాని అనుకున్న టైంలో బాపు దర్శకత్వంలో రాధాగోపాలం అనే చిత్రాన్ని స్నేహతో కలిసి చేస్తున్నారట శ్రీకాంత్.. అయితే సంక్రాంతి మూవీలో స్నేహ.. శ్రీకాంత్‌కి వదినగా నటించాల్సి వస్తుంది. దీనితో ఆడియన్స్ ఒప్పుకుంటారా అనే సందేహం శ్రీకాంత్‌లో మొదలయ్యిందట.
కానీ దర్శకుడు ముప్పలనేని మాత్రం ఈ పాత్ర నీకు మంచి పేరు తీసుకొస్తుందని శ్రీకాంత్ కిచెప్పారట.. చివరికి నిర్మాత ఆర్. బి. చౌదరి బలవంతం చేయడంతో ఈ సినిమాలో నటించేందుకు ఒప్పుకున్నాడట శ్రీకాంత్.. అయితే సినిమా స్క్రిప్ట్ దశలో ఉన్నప్పుడు ఆ పాత్రకి ముందుగా వడ్డే నవీన్ ని అనుకున్నాడట దర్శకుడు ముప్పలనేని .. పేపర్ పైన సీన్స్ రాసుకునేటప్పుడు విష్ణు పాత్రకి వడ్డే నవీన్ అనే రాసుకున్నారట.
ఈ విషయాన్ని ముప్పలనేని శివ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఇక ఆ పాత్ర శ్రీకాంత్‌కి ఎంత మంచి పేరు తీసుకువచ్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కాగా శ్రీకాంత్, ముప్పలనేని శివ కాంబినేషన్‌లో తాజ్‌మహల్, గిల్లికజ్జాలు, శుభలేఖలు చిత్రాలు వచ్చాయి.
Today Marks 17th Anniversary Of SuperHit Family Entertainer #Sankranti(RD: 18/02/2005).@VenkyMama @actress_Sneha #Sangeetha #AarthiAgarwal @actorsrikanth @ImSharwanand #Muppalanenishiva #RBChoudary #SARajkumar #17YearsForSankranti pic.twitter.com/s4BclizWKa
— 𝐂𝐡𝐨𝐰𝐝𝐚𝐫𝐢 𝐕𝐢𝐣𝐚𝐲 𝐊𝐮𝐦𝐚𝐫 (@ChowdariVijay) February 18, 2022
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com