Tollywood: "సుయోధనా... ఏమీ ఈ 'ప్రేమ్ కుమార్ కథ'".. ట్రైలర్ రిలీజ్ డేట్

సుయోధనా ఏంటీ.. ఈ ప్రేమ్ కుమార్ ప్రేమ గాధ అని మామ శకుని అడుగగా.. అప్పుడు మొదలెల్తాడు మన సుయోదనుడు.. చెప్పిందే చెప్పి చెప్పి పాపం మామ శకుని చెవులు కొరికేస్తాడు. ఆబాధను భరించలేని మామ శకుని అస్సలు అర్ధం కాలేదనగా... అప్పుడు జూలై 18న ట్రైలర్ వస్తుంది. అప్పుడు చూస్తే అర్థం అవుతుంది అని ముగిస్తాడు. అదన్నమాట కథ. మొత్తానికి ప్రేమ్ కుమార్ కథ ట్రైలర్ జూలై 18న రిలీజ్ అవునున్నట్లు చిత్ర యునిట్ తెలిపింది.
విభిన్న కథా చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు యంగ్ హీరో సంతోష్ శోభన్. ఇటీవల 'అన్నీ మంచి శకునములే..' అంటూ ఆడియన్స్‌ను మెప్పించాడు. 'ప్రేమ్ కుమార్ కథ' అంటూ మరో డిఫరెంట్ మూవీతో బాక్సాఫీసు వద్ద సందడి చేసేందుకు రెడీ అవుతున్నాడు.
'ప్రేమ్ కుమార్ కథ' చిత్రం ద్వారా నటుడు, రచయిత అభిషేక్ మహర్షి దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఈ సినిమా 'సారంగ ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్' పతాకంపై శివ ప్రసాద్ పన్నీరు నిర్మిస్తున్నారు. ఇందులో రాశీ సింగ్, రుచిత సాధినేని హీరోయిన్లుగా కృష్ణ చైతన్య, కృష్ణ తేజ, సుదర్శన్, అశోక్ కుమార్, శ్రీ విద్య కీలక పాత్రలు పోషిస్తున్నారు.
కష్టమైన డైలాగ్‌తో టీజర్‌ను డిజైన్ చేసిన మేకర్స్.. ఆడియన్స్‌ను ట్రైలర్ కోసం వేచి చూసేలా కాస్త క్రియేటివ్‌గా ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. జూలై 18న ట్రైలర్‌ను విడుదల చేస్తామని ప్రకటించారు. టీజర్ చూస్తుంటే ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించినట్లు అర్థమవుతోంది. కామెడీతోపాటు రెండు జంటల నేపథ్యంలో సాగే ప్రేమ కథను దర్శకుడు డిఫరెంట్‌గా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి సంగీతం ఎస్.అనంత్ శ్రీకర్ అందించగా.. ఎడిటర్ గ్యారీ బీహెచ్ వ్యవహరిస్తున్నారు. డీఓపీగా రాంపీ నందిగం పనిచేస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com