Pandit Shivkumar Sharma : సంగీత విద్వాంసుడు పండిట్ శివకుమార్ శర్మ కన్నుమూత

Pandit Shivkumar Sharma : ప్రముఖ సంగీత విద్వాంసుడు మరియు సంతూర్ వాద్యకారుడు పండిట్ శివకుమార్ శర్మ మే 10న గుండెపోటు కారణంగా మరణించారు. ప్రస్తుతం ఆయనకు 84 ఏళ్లు. డిట్ శివకుమార్ శర్మ గత ఆరు నెలలుగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. 1938 జమ్ములో జన్మించిన శివ కుమార్ శర్మ.. ఆ రాష్ట్రం నుంచి తొలి జానపద వాయిద్యకారుడిగా గుర్తింపు కూడా దక్కించుకున్నారు. శివకుమార్ శర్మ పదమూడేళ్ల వయసులో సంతూర్ నేర్చుకోవడం ప్రారంభించాడు. ఆయన మొదటి బహిరంగ ప్రదర్శన 1955లో ముంబైలో జరిగింది. శాస్త్రీయ సంగీతంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అయన దేశ విదేశాల్లో ఎన్నో ప్రదర్శలు ఇచ్చారు.
శివకుమార్ శర్మపలు చిత్రాలకు కూడా సంగీతం అందించారు.. శాంతారామ్ తీసిన 'జనక్ జనక్ పాయల్ బాజే'(1956) చిత్రానికి ఆయన తొలిసారిగా బ్యాక్‌గ్రౌండ్‌స్కోర్ చేశారు. 1960లో ఆయన తన తొలి సోలో ఆల్బమ్‌ను తీశారు. శివ-హరి ద్వయం మ్యూజిక్ డైరెక్టర్లుగా గుర్తింపు పొందిన వాళ్లలో ఒకరే ఈయన. కాగా 1991లో ప్రతిష్టాత్మకమైన పద్మశ్రీ, 2001లో పద్మవిభూషణ్ అవార్డులను ఆయన అందుకున్నారు. శివకుమార్ శర్మ మరణవార్త తెలియగానే సోషల్ మీడియా వేదికగా ఆయనకు పలువురు ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆయనకి నివాళులు అర్పించారు. ఇక శివకుమార్ భార్య పేరు మనోరమ, తనయుడు రాహుల్ శర్మ కూడా సంతూరు విద్వాంసుడే.
Our cultural world is poorer with the demise of Pandit Shivkumar Sharma Ji. He popularised the Santoor at a global level. His music will continue to enthral the coming generations. I fondly remember my interactions with him. Condolences to his family and admirers. Om Shanti.
— Narendra Modi (@narendramodi) May 10, 2022
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com