సినిమా

Sanya Malhotra : బ్రేకప్ కావడంతో డిప్రెషన్ లోకి వెళ్ళా : సన్యా మల్హోత్రా

Sanya Malhotra : లవ్, బ్రేకప్‌‌‌ల పైన ఆసక్తికరమైన కామెంట్స్ చేసింది బాలీవుడ్ బ్యూటీ సన్యా మల్హోత్రా .. తాజాగా ఓ ఛానల్‌‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత విషయాల పైన స్పందించింది.

Sanya Malhotra : బ్రేకప్ కావడంతో డిప్రెషన్ లోకి వెళ్ళా : సన్యా మల్హోత్రా
X

Sanya Malhotra : లవ్, బ్రేకప్‌‌‌ల పైన ఆసక్తికరమైన కామెంట్స్ చేసింది బాలీవుడ్ బ్యూటీ సన్యా మల్హోత్రా .. తాజాగా ఓ ఛానల్‌‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత విషయాల పైన స్పందించింది. ఈ సందర్భంగా తన చివరి బ్రేకప్‌కు సంబంధించిన విషయాలను గుర్తుచేసుకుంటూ ఎమోషనల్‌ అయ్యింది.

"ఢిల్లీలో ఉన్నప్పుడు ఓ వ్యక్తితో ప్రేమలో పడ్డాను. నాలుగేళ్ల పాటు అతనితో రిలేషన్‌‌‌‌లో ఉన్నాను, చివరికి బ్రేకప్‌, ఈ ప్రేమ తాలుకు జ్ఞాపకాలు నా హృదయాన్ని కదిలించాయి. విడిపోవడం అనేది అన్నింటికంటే ఎక్కువగా బాధించే విషయం అది. కానీ మనల్ని వద్దనుకునే వారి కోసం ఎంత బాధపడిన అది వృధానే. అందుకే నా మీద నేను ఫోకస్‌ పెట్టడం మొదలు పెట్టాను" ప్రేమ అనేది సెల్ఫ్ ల‌వ్ కంటే ముఖ్యమైన‌ది కాదనే సత్యాన్ని గ్రహించాను' అంటూ చెప్పుకొచ్చింది. అయితే ఆ వ్యక్తి ఎవరన్నది మాత్రం వెల్లడించలేదు.

కాగా బాలీవుడ్ స్టార్ హీరో ఆమీర్‌‌‌‌ఖాన్‌ మెయిన్ లీడ్‌‌‌లో తెరకెక్కిన 'దంగల్‌' చిత్రంతో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది సన్యా మల్హోత్రా. ఈ సినిమా సూపర్ సక్సెస్ కావడంతో ఆమెకి వరుస ఆఫర్లు వచ్చాయి. ప్రస్తుతం వరుస సినిమాలతో ఆమె దూసుకుపోతోంది. సినిమాలే కాకుండా సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌‌‌గా ఉంటూ సామాజిక అంశాలపై స్పందిస్తుంది.

Next Story

RELATED STORIES