Pelli Kani Prasad : పెళ్లికాని ప్రసాద్.. కట్నం అంతా క్యాష్ రూపంలోనే

కమెడియన్ నుంచి హీరోగా మారిన సప్తగిరి కొన్నాళ్లుగా కనిపించడం లేదు. సడెన్ గా మళ్లీ హీరోగా ‘పెళ్లి కాని ప్రసాద్’అనే మంచి క్యాచీ టైటిల్ తో వచ్చాడు. అభిలాష్ రెడ్డి డైరెక్ట్ చేస్తోన్న సినిమా ఇది. లేటెస్ట్ గా ఈ మూవీ టీజర్ ను రెబల్ స్టార్ ప్రభాస్ చేతుల మీదుగా విడుదల చేశారు. టీజర్ ఇంప్రెసివ్ గా ఉంది. ఓ యూనిక్ పాయింట్ తో రూపొందించినట్టు కనిపిస్తోంది.
కట్నం తీసుకోవడమే జీవితాశయం అన్నట్టుగా కనిపించే వంశం ‘కట్నం’వారిది. ఆ కట్నం వంశంలో ఎవరెవరు ఎంత కట్నం తీసుకున్నారు అనేది రెండు శతాబ్దాల క్రితం నుంచే ఫోటోస్ ఫ్రేమ్స్ లో పెట్టి ఉంటారు. అంటే ప్రతి తరం ఆ తరానికే హయ్యొస్ట్ అనేలా కట్నం తీసుకోవాలన్నమాట. అది ఈ జెనరేషన్ లో సప్తగిరి వరకూ వచ్చే సరికి రెండు కోట్లు అవుతుంది. అందుకు పదిలక్షలు తగ్గినా పెళ్లే క్యాన్సిల్ చేస్తాడు అతని తండ్రి. అలాగే కట్నం మొత్తం క్యాష్ రూపంలోనే కావాలని, ఆన్ లైన్ లో చెల్లితే జిఎస్టీ, ట్యాక్సులు పడతాయి అని పెళ్లి కొడుకే తండ్రికి చెప్పడం చూస్తే.. వారికి కట్నం ఎంత ఇంపార్టెంట్ అనేది అర్థం అవుతుంది. మరి ఈ కట్నం గోల వల్ల అసలు ఆ కుర్రాడికి పెళ్లైందా లేదా అనేది సినిమాలో తెలుస్తుంది.
ఎప్పుడూ నానా హంగామా చేస్తూ అప్పుడప్పుడూ తమిళ్ ఫ్లేవర్ ఓవర్ యాక్షన్ తో కనిపించే సప్తగిరి ఈ సారి కాస్త సెటిల్డ్ గా కనిపిస్తున్నాడు. కంటెంట్ కు కట్టుబడినట్టున్నాడేమో కానీ.. ఈ తరహాలో కట్నం కోసమే పెళ్లి అని అల్లరి నరేష్ మూవీ కూడా ఒకటి వచ్చింది. మరి దానికీ దీనికీ డిఫరెన్స్ ఏంటనేది సినిమా చూస్తే కానీ తెలియదు.
సప్తగిరితో పాటు ప్రియాంక శర్మ, మురళీధర్ గౌడ్, లక్ష్మణ్ మీసాల, రోహిణి తదితరులు ఇతర పాత్రల్లో కనిపించబోతున్నారు. ఈ పెళ్లికాని ప్రసాద్ ఈ నెల 21న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com