Sara Khan: 'అడ్డంగా దొరికిపోయినా వదిలేశాను'.. భర్త ఎఫైర్స్ గురించి బయటపెట్టిన నటి..

Sara Khan: అడ్డంగా దొరికిపోయినా వదిలేశాను.. భర్త ఎఫైర్స్ గురించి బయటపెట్టిన నటి..
Sara Khan:సారా ఖాన్, అలీ పెళ్లి చాలా వెరైటీగా జరిగింది. బిగ్ బాస్ హౌస్‌లో పెళ్లి చేసుకొని ఓ సెన్సేషన్‌ను క్రియేట్ చేశారు

Sara Khan: బిగ్ బాస్ తరహాలోనే మరో కొత్త షో హిందీలో ప్రారంభమయ్యి అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అదే 'లాక్ అప్'. ఈ షోను ఎంతో హైప్ మధ్య ప్రారంభించింది నిర్మాత ఏక్తా కపూర్. పైగా కాంట్రవర్షియల్ క్వీన్‌గా పేరు తెచ్చుకున్న కంగనా రనౌత్ దీనికి హోస్ట్‌గా వ్యవహరించడం మరొక ప్రత్యేకత. ఈ షోలో చాలామంది నటీనటుల తమ పర్సనల్ జీవితాల గురించి రహస్యాలు రాబట్టే ప్రయత్నం చేస్తోంది యాజమాన్యం.

లాక్ అప్ షోలో మాజీ భార్యభర్తలు కూడా కంటెస్టెంట్స్‌గా పాల్గొన్నారు. వీరు విడాకులు తీసుకున్న తర్వాత మొదటిసారి ఈ షోలో కలిసి పాల్గొనడం చాలామంది ప్రేక్షకులకు ఇంట్రెస్టింగ్ పాయింట్‌గా మారింది. వారే సారా ఖాన్, అలీ మర్చంట్. ఈ ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకొని ఆ తర్వాత కొంతకాలానికే మనస్ఫర్థలు వచ్చి విడిపోయారు. అయితే తాజాగా వీరు విడిపోవడానికి కారణాలు ఏంటో బయటపెట్టింది సారా ఖాన్.

సారా ఖాన్, అలీ పెళ్లి చాలా వెరైటీగా జరిగింది. వీరిద్దరు బిగ్ బాస్ హౌస్‌లో పెళ్లి చేసుకొని అప్పట్లో ఓ సెన్సేషన్‌ను క్రియేట్ చేశారు. అయితే పెళ్లయిన తర్వాత కూడా అలీకి వేరే అమ్మాయిలతో ఎఫైర్ ఉండేదని సారా చెప్పుకొచ్చింది. తాను అలీని మనసారా ప్రేమించానని, అందుకే అడ్డంగా దొరికిపోయినా.. వదిలేసే దానినని తెలిపింది సారా.

మూడున్నర సంవత్సరాల్లో 300 ఛాన్సులు ఇచ్చినా కూడా అలీ వాటిని నిలబెట్టుకోలేకపోయాడని తెలిపింది సారా. తనకు లోఖండ్‌వాలాలో ఒక స్పా ఉందని, అందులో పనిచేసే ఓ అమ్మాయితో అలీ ఎఫైర్ పెట్టుకున్నాడని బయటపెట్టింది. విడాకుల తర్వాత తాను మళ్లీ మామూలు మనిషి కావడానికి నాలుగు సంవత్సరాలు పట్టిందని తన వైవాహిక జీవితం గురించి తెలిపింది సారా.

Tags

Read MoreRead Less
Next Story