Balakrishna : బాలయ్య కోసం సరైన విలన్ ను తెచ్చిన బోయపాటి

నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను డైరెక్ట చేస్తోన్న మూవీ 'అఖండ 2 తాండవం'. రెండేళ్ల క్రితం వచ్చిన అఖండకు సీక్వెల్ గా రూపొందుతోన్న సినిమా ఇది. థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ప్రగ్యా జైశ్వాల్, సంయుక్త మీనన్ ఫీమేల్ లీడ్ లో కనిపించబోతున్నారు. ఆల్రెడీ ప్రగ్యా ఫస్ట్ పార్ట్ లో కూడా ఉంది కాబట్టి ఈ పార్ట్ లోనూ కంటిన్యూ అవుతోంది. ఇక ఈ మూవీ అనౌన్స్ మెంట్ నుంచే అంచనాలు పెంచుతోంది. అఖండ టైటిల్ కు తగ్గట్టుగానే అఖండ విజయం సాధించింది. అందుకే ఈ మూవీని ప్యాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయబోతున్నారు.
ఇక బోయపాటి శ్రీను సినిమా అంటే విలన్స్ చాలా పవర్ ఫుల్ గానూ క్రూయొల్ గానూ ఉంటారు కదా. ఆల్రెడీ అఖండతో శ్రీకాంత్ ను విలన్ గా చూపించాడు. ఈ సారి సరైనోడు విలన్ ను తీసుకు వచ్చాడు బోయపాటి. అల్లు అర్జున్ సరైనోడు మూవీలో వైరం ధనుష్ పాత్రలో అత్యంత వయొలెంట్ గా కనిపించిన ఆది పినిశెట్టిని ఈ చిత్రంలో విలన్ గా తీసుకున్నాడు బోయపాటి. ఆల్రెడీ ఆదితో కొన్ని యాక్షన్ సీక్వెన్స్ లు కూడా చిత్రీకరిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ జరుపుకుంటోంది. ఇక్కడే ఆది, బాలయ్య మధ్య యాక్షన్ సీన్స్ షూట్ చేస్తున్నారట. ఆది వెర్సటైల్ యాక్టర్. ఎంత ప్లెజెంట్ గా ఉంటాడో అంత వయొలెంట్ గానూ కనిపించగలడు. సరైనోడులో అలా కనిపించిన అతనే రంగస్థలంలో కుమార్ బాబుగా కూల్ గా మెప్పించాడు. మొత్తానికి విలన్స్ విషయంలో బోయపాటి మరోసారి తన విలక్షణత చూపిస్తున్నాడనే చెప్పాలి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com