Nani : సరిపోదా శనివారం.. పోతారు.. మొత్తం పోతారు..

నేచురల్ స్టార్ నాని, ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా నటిస్తోన్న సినిమా 'సరిపోదా శనివారం'. వివేక్ ఆత్రేయ డైరెక్ట్ చేస్తోన్న ఈ మూవీని డివివి దానయ్య నిర్మిస్తున్నాడు. ఈ నెల 29న విడుదల కాబోతోంది. లేటెస్ట్ గా ఈ మూవీ ట్రైలర్ విడుదల చేశారు. నాని మాస్ హీరో కావాలని తపిస్తోన్న దానికి పరిష్కారంలా కనిపిస్తోందీ ట్రైలర్. మాస్ హీరో అవుతాడా లేదా అనేది ట్రైలరే చెప్పలేదు. బట్ దసరా తర్వాత ఆ స్థాయిలో మాసివ్ గా కనిపిస్తోంది. అలాగని దసరా వల్ల నానికి మాస్ లో ఫాలోయింగ్ పెరిగింది అని చెప్పలేం.
సోకుల పురం అనే ఊరిలో జరిగే సంఘటనల నేపథ్యంలో ఈ కథ అల్లుకున్నాడు దర్శకుడు. నిజానికి ఇలాంటి కథలకు ఫిక్షనల్ టౌన్ పేర్లు పెడితే పూర్తిగా తేలిపోతాయి. కనీసం ఆ ఊరి పేర్లు రిలేట్ చేసుకునేలా అయినా ఉండాలి. '' నా సహనం నశించింది.. నా కన్నీళ్లు ఇంకిపోయాయి. అందుకే మనందరి తరఫున భయాన్ని దాటి ఒకడుగు ముందుకు వేద్దాం అనుకుంటున్నా.." అని ఒక చిన్న పిల్లాడు చెప్పే డైలాగ్ తో స్టార్ట్ అయిందీ ట్రైలర్. ఆ పిల్లాడు నాని అని వేరే చెప్పక్కర్లేదు. కానీ ఆ డైలాగ్ కు దారి తీసిన సన్నివేశాలు అతను చిన్నప్పుడే ఫేస్ చేశాడని అర్థం అవుతోంది. ఇక పోలీస్ స్టేషన్ ల సిఐ చేసే ఆకృత్యాలు.. అతనితో హీరో తలపడే సందర్భం.. అన్నీ కేవలం మాస్ ను మెప్పించాలనే తాపత్రయంలో కనిపిస్తున్నాయి తప్ప నేచురల్ గా కనిపించడం లేదు. పైగా ఇప్పటి వరకూ ఈ మూవీ నుంచి వచ్చిన అప్డేట్స్ తో కంపేర్ చేస్తే ట్రైలర్ పూర్తి భిన్నంగా.. ఆ కంటెంట్ కు ఈ ట్రైలర్ కు సంబంధం లేదు అన్నట్టుగా కనిపిస్తోంది. అందుచేత ఇది ఫోర్స్ డ్ మాస్ మూవీలా కనిపిస్తోందంటే అతిశయోక్తి కాదు. ట్రైలర్ చివర్లో వచ్చిన పోతారు.. మొత్తం పోతారు అనే డైలాగ్ లో కూడా పెద్ద పవర్ ఏం లేదు
ఇక ఈ రోజుల్లో ఏ పోలీస్ అయినా మరీ అంత దారుణంగా ప్రవర్తిస్తే లైట్ తీసుకోవడం లేదు ఎవరూ. మరి ఇది ఏ కాలంలో జరిగే కథో కానీ.. ఓవరాల్ గా మాస్ హీరో అయిపోవాలన్న తాపత్రయంలో నాని చేసిన సినిమా లేదా.. తన క్లాస్ మూవీ ' అంటే సుందరానికి'ని ఫ్లాప్ చేశారనే ఆక్రోశంలో వివేక్ ఆత్రేయ చేసిన సినిమాలా ఈ ట్రైలర్ చూస్తే కనిపిస్తోంది. మరి ఇంతకు మించిన ఎంగేజింగ్ కంటెంట్ సినిమాలో ఉంటే ఓకే. లేదా ఈ ట్రైలర్ ఫార్మాట్లోనే సినిమా ఉండబోతోందీ అంటే రిజల్ట్ ఎక్స్ పెక్ట్ చేయొచ్చు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com