Saripodhaa Sanivaaram : నార్త్ అమెరికాలో సరిపోదా శనివారం రికార్డు

నేచురల్ స్టార్ నాని, వివేక్ ఆత్రేయ కాంబోలో వచ్చిన సినిమా సరిపోదా శనివారం ఉత్తర అమెరికాలో ప్రభంజనం సృష్టిస్తోంది.5బాక్సఫీసు వద్ద సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది. ఇప్పటికే 1 మిలియన్ డాలర్లకు పైగా కలెక్షన్లు రాబట్టిందని చిత్ర యూనిట్ తెలిపింది. ఇప్పటి వరకు నాని నటించిన 10 సినిమాలు అమెరికాలో ఒక మిలియన్ డాలర్లకు పైగా రాబట్టాయి. గతంలో నాని నటించిన చిత్రాల్లో రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఈగ, మారుతి దర్శకత్వంలో రూపొందిన భలే భలే మొగాడివోయ్, నేను లోకల్, నిన్ను కోరి, ఎంసీఏ, జెర్సీ, అంటే సుందరానికి, దసరా, హాయ్ నాన్న చిత్రాలు మిలియన్ డాలర్ క్లబ్లో చేరాయి. తాజాగా సరిపోదా శనివారం మూవీ ఈ జాబితాలో చేరింది. ఇక టాలీవుడ్ విషయానికి వస్తే అత్యధికంగా మహేశ్ బాబు సినిమాలు అమెరికాలో ముందున్నాయి. 1 మిలియన్ కు పైగా కలెక్ట్ చేసిన చిత్రాల్లో మహేబాబు నటించినవే 12 ఉండటం విశేషం.
ఫస్ట్ డే ఇండియాలో 8.5 కోట్ల వసూలు
ఏపీ, తెలంగాణలో 'సరిపోదా శనివారం' సినిమాకు మంచి టాక్ దక్కింది. సినిమా హిట్ అంటూ రివ్యూలు చక్కర్లు కొడుతున్నాయి. మార్నింగ్ షోస్ కన్నా నైట్ షోస్ కలెక్షన్స్ బాగా వచ్చాయి. మొత్తంగా ఇండియాలో మొదటి రోజు రూ. 8.5 కోట్ల వసూళ్లు వచ్చాయి
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com