Sarkaru Naukari : 'నీళ్ల బాయి నిమ్మలంగా అడిగే..' సాంగ్ లో నేచురల్ లుక్ లో సింగర్ సునీత కొడుకు ఆకాష్
సింగర్ సునీత కుమారుడు ఆకాష్ నటిస్తోన్న తొలి తెలుగు చిత్రం 'సర్కారు నౌకరి'. ఈ చిత్రం ఈ ఏడాది ఆరంభంలో హైదరాబాద్‌లో ఘనంగా పూజా కార్యక్రమాలతో అధికారికంగా ప్రారంభమైంది. ఆకాష్ సవతి తండ్రి రామ్ వీరపనేని మొదటి షాట్‌కి దర్శకత్వం వహించగా, చిత్ర నిర్మాత రాఘవేంద్రరావు మొదటి క్లాప్‌ని వినిపించారు. RK టెలిషో బ్యానర్‌పై రాఘవేంద్రరావు నిర్మాతగా గంగమౌని శేఖర్ దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రంలో ఆకాష్ తన తోటి నూతన నటి భావన వాజపండాల్‌తో స్క్రీన్‌ను పంచుకోనున్నాడు. కాగా తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ అప్ డేట్ వచ్చింది. ఈ చిత్రంలోని 'నీళ్ల బాయి' అనే సాంగ్ ను మేకర్స్ రిలీజ్ చేశారు.
తెలంగాణ స్లాంగ్ లో సాగే ఈ సాంగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక నటీనటులు ఈ పాటలో చాలా నేచురల్ గా కనిపించారు. భావన వాజపండాల్ తన సహజత్వంతో అందర్నీ కట్టిపడేస్తోంది. ఇక ఆకాష్ కూడా తగిన హావభావాలతో అలరించాడు. మొత్తానికి ఈ వీడియో సాంగ్ ఆద్యంతం తెలంగాణలోని పల్లెల్లో ఉండే యూత్ స్వభావాన్న, వారి ఆలోచనలకు అద్దం పట్టేదిగా ఉంది. మొత్తానికి 'నీళ్ల బాయి నిమ్మలంగా అడిగే.. ఈ సక్కని సుక్కా లగ్గమెప్పుడని..' అంటూ సాగే లిరిక్స్ అద్భుతంగా ఉన్నాయి. ఇదిలా ఉండగా ఈ సినిమాలో తనికెళ్లభరణి, రమ్య పొందూరి, సత్య సాయి శ్రీనివాస్ తదితరులు పలు పాత్రల్లో కనిపించనున్నారు. ఈ మూవీ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని.. త్వరలోనే విడుదలకు సిద్దమవుతోంది. ఈ సినిమాను దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు నిర్మిస్తుండడంతో.. మూవీపై మంచి అంచనాలే ఉన్నాయి.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com