Sarkaru Vaari Paata First Review: మైండ్ బ్లోయింగ్ మహేష్.. ఫస్ట్ రివ్యూ..
Sarkaru Vaari Paata First Review: సర్కారు వారి పాట పేరులోనే ఓ పాజిటివ్ బజ్ క్రియేట్ చేశాడు దర్శకుడు పరశురామ్.. యువత కలల రాకుమారుడు మహేష్, క్రేజీ హీరోయిన్ కీర్తి సురేష్ జంటగా నటించిన ఈ చిత్రంపై ఫ్యాన్స్ ఓ రేంజ్ లో ఎక్స్ పెక్టేషన్స్ పెట్టుకున్నారు. ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని ఎదురు చూస్తున్నారు మహేష్ అభిమానులు.
ఈ నెల 12న థియేటర్లలో రిలీజ్ అవుతోంది. అయితే UK, UAE మరియు భారతదేశంలో తనను తాను చలనచిత్ర విమర్శకుడిగా భావించుకునే ఉమైర్ సంధు, సర్కారు వారు పాట చిత్రాన్ని వీక్షించి సోషల్ మీడియా వేదికగా సమీక్షను పంచుకున్నారు. మహేష్ బాబు నటించిన ఈ చిత్రానికి 4.5 రేటింగ్ కూడా ఇచ్చేశారు.
మహేష్, కీర్తిసురేష్ ల మధ్య కెమిస్ట్రీ చాలా బావుంది. సంగీతం గురించి అయితే చెప్పనక్కరలేదు.. ఎవరి నోట చూసినా కళావతి సాంగ్ వినిపిస్తోంది. ఇక ఈ చిత్రంలో మహేష్ బాబు అయితే మరింత అందంగా కనిపిస్తున్నాడు.. తానొక్కడే ఈ చిత్రాన్ని తన భుజాలపై మోశాడు. ఈ చిత్రాన్ని చూడడానికి అది ఒక్కటి తప్పనిసరి కారణం అవుతుంది.
ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భీభత్సాన్ని సృష్టిస్తుందనడంలో ఎటువంటి అతిశయోక్తీ లేదు. ఈ చిత్రం గురించి ఇంకా ఉమైర్ ఇలా రాసుకొచ్చాడు.. ఈ మధ్య కాలంలో మహేష్ తన అత్యుత్తమ నటనను ఈ చిత్రంలో ప్రదర్శించాడు. అభిమానులు ఈ చిత్రాన్ని పెద్ద ఎత్తున ఆదరిస్తారు అని తానూ మహేష్ కి ఓ అభిమానిగా మారిపోయినట్లు రాసుకొచ్చాడు.. అంతగా నచ్చింది ఆయనకు ఈ చిత్రం.
హీరోయిన్ కీర్తి సురేష్ గురించి చెప్పాలంటే.. ఆమె లేకపోతే ఈ సినిమా అసంపూర్తిగా ఉంటుంది. కీర్తి చాలా అందంగా ఉంది.. తన పాత్రకు తగిన న్యాయం చేసింది.. ఈ చిత్రంతో తన ఇమేజ్ మరింత పెరుగుతుంది. సర్కారువారి పాట కచ్చితంగా మాస్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. తనకు వ్యక్తిగతంగా 2022లో ఇష్టమైన తెలుగు సినిమాగా ఉమైర్ రాసుకొచ్చారు.. దీనికి రేటింగ్ 4.5/5 ఇచ్చేశారు. ఉమైర్ రేటింగ్, సమీక్ష చూసి మహేష్ బాబు ఫ్యాన్స్ మస్తు ఖుషీ అవుతున్నారు. వెయిట్.. వెయిట్ ఇంకా ఒక్క రోజు ఆగితే మన థియేటర్లలోకి కూడా వచ్చేస్తుంది ఫ్యాన్స్.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com