అఫీషియల్... 'సర్కారు వారి పాట' రిలీజ్ డేట్ ఫిక్స్..!

Sarkaru Vaari Paata : మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా నటిస్తున్న తాజా చిత్రం 'సర్కారు వారి పాట' .. పరుశురాం దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నాడు. అయితే ఈ సినిమాని ముందుగా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయాలనీ అనుకున్నారు మేకర్స్.. కానీ సంక్రాంతికి భీమ్లా నాయక్, RRR, రాథేశ్యామ్ వంటి చిత్రాలు బరిలో ఉండడంతో సర్కారు వారి పాట రిలీజ్ డేట్ ని మేకర్స్ చేంజ్ చేశారు. ఈ సినిమాని ఏప్రిల్ 1 2022న విడుదల చేయాలనీ ఫిక్స్ అయ్యారు. ఈ మేరకు ఆఫీషియల్ అనౌన్స్ మెంట్ కూడా చేశారు. కాగా ఇప్పటివరకు రిలీజైన పోస్టర్స్, టీజర్ సినిమా పైన అంచనాలను పెంచేశాయి.
The Date is Locked for the Auction & the Action in Theatres 🔥#SarkaruVaariPaata Grand Release on 1st APRIL, 2022 💥#SarkaruVaariPaataOnApril1
— Mythri Movie Makers (@MythriOfficial) November 3, 2021
Super 🌟 @urstrulyMahesh @KeerthyOfficial @ParasuramPetla @MusicThaman @GMBents @14ReelsPlus @saregamasouth pic.twitter.com/pLN14g2ER1
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com