Sarkaru Vaari Paata: 'సర్కారు వారి పాట' మరోసారి వాయిదా..?

Sarkaru Vaari Paata: సూపర్ స్టార్ మహేశ్ బాబు సినిమా కోసం తన అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేశ్ బాబు నటించిన 'సరిలేరు నీకెవ్వరూ'నే తన చివరి చిత్రం. ఈ మూవీ వచ్చి ఇప్పటికే రెండు సంవత్సరాలు పూర్తి అయిపోయింది. దీంతో తన తరువాతి చిత్రం ఎప్పుడు వస్తుందా అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఇంతలోనే సర్కారు వారి పాట మరోసారి వాయిదా పడనుంది అని రూమర్స్ వైరల్ అవుతున్నాయి.
పరశురామ్ దర్శకత్వంలో మహేశ్ నటిస్తున్న చిత్రమే 'సర్కారు వారి పాట'. చాలారోజుల తర్వాత మహేశ్ ఇలాంటి ఒక పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్‌లో నటిస్తున్నాడు. పైగా ఇప్పటికే విడుదలయిన పాటలు, గ్లింప్స్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అయితే ఇప్పటికే ఎన్నోసార్లు విడుదలను వాయిదా వేసుకున్న ఈ సినిమా.. చివరికి మే 12న రిలీజ్ కానున్నట్టు మూవీ టీమ్ ఇటీవల ప్రకటించింది. కానీ మరోసారి వాయిదా తప్పదు అని సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది.
ఒక పాటకు మినహా సర్కారు వారి పాట షూటింగ్ అంతా ముగిసిందని తాజాగా ఓ అప్డేట్ బయటికొచ్చింది. దీంతో మహేశ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారు. అనుకున్నట్టుగానే మే 12న మూవీ విడుదల అవుతుందని ఫిక్స్ అయ్యారు. కానీ మరోసారి ఈ సినిమా వాయిదా పడనుందని టాక్ వినిపిస్తోంది. మే 12 నుండి జూన్ 3కు ఈ సినిమా పోస్ట్‌పోన్ అయ్యిందని సమాచారం.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com