Sarkaru Vaari Paata: 'సర్కారు వారి పాట' వాయిదా తప్పదా..?

Sarkaru Vaari Paata (tv5news.in)
Sarkaru Vaari Paata: సూపర్స్టార్మహేశ్బాబు నటించిన 'సర్కారువారి పాట' సినిమా మరోసారి వాయిదా పడే అవకాశం ఉంది. ప్రస్తుత పరిస్థితుల కారణంగా మూవీ విడుదలను వాయిదా వేయాలని భావిస్తున్నారట చిత్ర దర్శక నిర్మాతలు. ప్రస్తుత పరిస్థితుల కారణంగా ఆగస్టు 5న చిత్రాన్ని విడుదల చేయాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. కరోనా ప్రభావం కారణంగా ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న పలు సినిమాలు వాయిదా పడ్డాయి.
పలువురు స్టార్స్‌కు కూడా కోవిడ్ సోకింది. మహేశ్‌బాబు, కీర్తి సురేశ్ జంటగా నటించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా రావాల్సి ఉంది. అయితే వివిధ కారణాలతో ఏప్రిల్ 1న విడుదల చేస్తామని చిత్ర బృందం ప్రకటించింది. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఈ చిత్రం విడుదల మరింత ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే మహేశ్‌బాబుతోపాటు, కీర్తిసురేశ్ కూడా కరోనా బారినపడ్డారు.
ఇద్దరూ స్వల్ప లక్షణాలతో బాధపడుతున్నారు. ప్రస్తుతం వీరు హోం ఐసోలేషన్ ఉంటూ చికిత్స తీసుకుంటున్నారు. పైగా మహేశ్‌కు ఇటీవల శస్త్ర చికిత్స కూడా జరిగింది. దీంతో 'సర్కారువారి పాట' చిత్రీకరణ మరింత ఆలస్యం కానుంది. అయితే ముందుగా అనుకున్నట్లుగా ఏప్రిల్ 1వ తేదీకి సినిమా పూర్తయ్యే సూచనలు దాదాపు కనిపించటం లేదు. పరిస్థితులన్నీ సరిగా ఉంటే సినిమా చిత్రీకరణ పూర్తయితే ఆగస్టు 5న విడుదల చేయాలని దర్శక-నిర్మాతలు యోచిస్తున్నట్లు తెలుస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com