Kalavathi Song: 'సర్కారు వారి పాట'లో 'కళావతి' సాంగ్ మేకింగ్‌కు ఎంత ఖర్చు అయ్యిందంటే..

Kalavathi Song: సర్కారు వారి పాటలో కళావతి సాంగ్ మేకింగ్‌కు ఎంత ఖర్చు అయ్యిందంటే..
Kalavathi Song:ప్రస్తుతం ఎక్కడ విన్నా ‘కళావతి’ పాటే. మహేశ్ గ్రేస్, కీర్తి సురేశ్ బ్యూటీకి ప్రేక్షకులు ఫిదా అయిపోతున్నారు

Kalavathi Song: మహేశ్, కీర్తి సురేశ్ జంటగా నటించిన చిత్రం 'సర్కారు వారి పాట'. మహేశ్ అభిమానులు ఎంతోకాలంగా ఎదురుచూస్తు్న్న సినిమా ఇది. అందుకే దర్శకుడు పరశురామ్ దీనిని ఒక పక్కా కమర్షియల్ సినిమాగా తీర్చిదిద్దుతున్నాడు. ఇప్పటివరకు సర్కారు వారి పాట నుండి ఓ టీజర్ రిలీజ్ కాగా.. తాజాగా 'కళావతి' అనే పాట నెట్టింట్లో హల్‌చల్ చేస్తోంది. సినిమాలో ఈ ఒక్క సాంగ్ కోసమే చాలా ఖర్చు అయ్యిందంటూ టాలీవుడ్‌లో టాక్ వినిపిస్తోంది.

సింగర్ సిడ్ శ్రీరామ్ ఏ పాట పాడినా అది చార్ట్‌బస్టర్ అవ్వాల్సిందే. ఆ సెంటిమెంట్‌ను బాగా ఫాలో అవుతాడు తమన్. అందుకే తాను మ్యూజిక్ కంపోజ్ చేసే సినిమాల నుండి ముందుగా సిడ్ శ్రీరామ్ పాడిన పాటే విడుదలయ్యేలాగా చూసుకుంటాడు. అనుకున్నట్టుగానే ఆ పాటలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటాయి. సర్కారు వారి పాట విషయంలో కూడా అదే జరిగింది.

ప్రస్తుతం ఎక్కడ విన్నా 'కళావతి' పాటే. ఈ పాటలో మహేశ్ గ్రేస్, కీర్తి సురేశ్ బ్యూటీకి ప్రేక్షకులు ఫిదా అయిపోతున్నారు. లిరికల్ వీడియోకు 24 గంటల్లోపే మిలియన్లలో వ్యూస్ సాధించింది ఈ పాట. అయితే మూవీ టీమ్ అంతా ఈ పాట షూటింగ్ కోసం ఫారిన్ వెళ్లింది. అయితే ఈ పాట కోసం కనీసం రూ. 40 నుండి 60 లక్షలు ఖర్చు అయిండొచ్చని ఫిల్మ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story