Sarkaru Vaari Paata: 'సర్కారు వారి పాట' సినిమాను ప్రమోట్ చేస్తున్న హైదరాబాద్ పోలీస్..

Sarkaru Vaari Paata: మహేశ్ బాబు నటిస్తున్న అప్‌కమింగ్ కమర్షియల్ ఎంటర్‌టైనర్ 'సర్కారు వారి పాట'. ఈ సినిమాను పరశురామ్ తెరకెక్కిస్తుండగా.. కీర్తి సురేశ్ ఇందులో హీరోయిన్‌గా నటిస్తోంది. సర్కారు వారి పాట మే 12న ప్రేక్షకుల ముందుకు రానుండగా.. మూవీ టీమ్ ఇటీవల ట్రైలర్‌ను విడుదల చేసింది. అయితే హైదరాబాద్ పోలీసులు సైతం ట్రాఫిక్ రూల్స్‌ను వివరిస్తూ ఈ ట్రైలర్‌లోని ఓ షాట్‌ను ఉపయోగించడం విశేషం.
హైదరాబాద్ సిటీ పోలీస్.. ముఖ్యంగా ట్రాఫిక్ పోలీస్ చాలా క్రియేటివ్ అయిపోయారు. ఈమధ్య కాలంలో వారు ట్రాఫిక్ రూల్స్ గురించి ప్రజలకు వివరించాలి అనుకుంటే దానిని చాలా క్రియేటివ్‌గా చెప్పడం అలవాటు చేసుకున్నారు. మీమ్స్ రూపంలో ఎంటర్‌టైనింగ్‌గా ట్రాఫిక్ రూల్స్‌ను వివరిస్తున్నారు సిటీ పోలీస్. తాజాగా ఈ లిస్ట్‌లోకి సర్కారు వారి పాట కూడా చేరింది.
సర్కారు వారి పాట ట్రైలర్ విడుదలయిన కాసేపట్లోనే రికార్డ్ స్థాయి వ్యూస్ సంపాదించింది. అయితే ఈ ట్రైలర్‌లో హీరో.. విలన్ గ్యాంగ్‌లోని ఒకడికి హెల్మెట్ పెట్టే షాట్ ఉంటుంది. ఆ షాట్‌ను కట్ చేసి హైదరాబాద్ సిటీ పోలీసులు తమ ట్విటర్‌లో పోస్ట్ చేశారు. 'హెల్మెట్ ధరించండి' అంటూ ఈ వీడియోకు క్యాప్షన్ కూడా పెట్టారు. ఇక ట్రెండింగ్‌లో ఉన్నదాన్ని ఫాలో అయిపోవడం సిటీ పోలీసులకు బాగా తెలుసు అంటూ నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.
#WearHelmet #SafetyFirst
— హైదరాబాద్ సిటీ పోలీస్ Hyderabad City Police (@hydcitypolice) May 2, 2022
Vc: SarkaruVaariPaataTrailer pic.twitter.com/Npgg05zeXs
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com