Sarkaru Vaari Paata Trailer: 'సర్కారు వారి పాట' ట్రైలర్ రిలీజ్.. ఇందులో ఆ డైలాగ్ హైలెట్..

Sarkaru Vaari Paata Trailer: సర్కారు వారి పాట ట్రైలర్ రిలీజ్.. ఇందులో ఆ డైలాగ్ హైలెట్..
X
Sarkaru Vaari Paata Trailer: సూపర్ స్టార్ మహేష్ నటించిన మోస్ట్ అవెయిటెడ్ మూవీ సర్కారు వారి పాట.

Sarkaru Vaari Paata Trailer: సూపర్ స్టార్ మహేష్ నటించిన మోస్ట్ అవెయిటెడ్ మూవీ సర్కారు వారి పాట. ఈ నెల 12న రిలీజ్ అవుతున్న ఈ భారీ చిత్రానికి పరశురామ్ దర్శకుడు. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించింది. ఇప్పటికే సాంగ్స్ తో సినిమాపై అంచనాలు పెరిగాయి. ఇప్పుడు ఆ అంచనాలను మరింత పెంచుతోంది ట్రైలర్. సర్కారు వారి పాట ధియేట్రికల్ ట్రైలర్ ఇవాళ విడుదలైంది.

సినిమాలో మహేశ్ బాబు కామెడీ టైమింగ్ హైలెట్‌గా నిలవనుంది అని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ఇక కీర్తి సురేశ్ తన గ్లామర్‌తో అందరినీ మెస్మరైజ్ చేయడానికి రెడీ అయిపోయింది. వెన్నెల కిషోర్ లాంటి వారు కామెడీ డోస్‌ను మరింత పెంచేటట్టుగా అనిపిస్తోంది. మొత్తానికి 105 షాట్స్‌తో విడుదలయిన ట్రైలర్ సర్కారు వారి పాట సినిమాపై అంచనాలను పెంచేస్తోంది.

ట్రైలర్‌లో డైలాగులు కూడా క్యాచీగా ఉన్నాయి. అయితే ఈ ట్రైలర్‌లో మహేశ్.. 'నేను విన్నాను.. నేను ఉన్నాను' అనే డైలాగ్ చెప్పడం అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ డైలాగ్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి బయోగ్రాఫీగా తెరకెక్కిన 'యాత్ర' సినిమాలోనిది కావడం విశేషం. అయితే ఆ డైలాగ్ ఇక్కడ ఉపయోగించడం ఏంటి అని నెటిజన్లు అనుకుంటున్నారు.

Tags

Next Story