Mahesh Babu: ఏంటా వరసలు.. ఒకసారి వచ్చికలువు: యూట్యూబర్ తో మహేష్ బాబు

Mahesh Babu: ఏంటా వరసలు.. ఒకసారి వచ్చికలువు: యూట్యూబర్ తో మహేష్ బాబు
Mahesh Babu: మై విలేజ్ షో అనిల్ మాట్లాడిన మాటలకు మహేష్ తో పాటు అందరినీ నవ్వుల్లో ముంచెత్తాడు.

Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా నటించిన చిత్రం సర్కారు వారి పాట మిశ్రమ స్పందన వినిపిస్తున్నా బాక్సాఫీస్ వద్ద మాత్రం కాసుల వర్షం కురిపిస్తోంది. పరశురామ్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ చిత్రం మహేష్ కెరీర్ లో మరో సూపర్ హిట్ మూవీగా నిలిచింది. తాజాగా ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా చిత్ర యూనిట్ యూట్యూబర్లతో ముచ్చటించింది.

మై విలేజ్ షో అనిల్ మాట్లాడిన మాటలకు మహేష్ తో పాటు అందరినీ నవ్వుల్లో ముంచెత్తాడు. మిమ్మల్ని సార్ సార్ అని అందరూ పిలుస్తున్నారు.. నేను మాత్రం అన్న అని పిలుచుకుంటా.. మేం వాట్సాప్ స్టేటస్ లో మహేష్ అన్న అని పెట్టుకుంటాం.. మీరు ఒక్కసారి నన్ను తమ్ముడు అని పిలవండి అన్న.. అని అనిల్ అడగ్గా.. చెప్పు తమ్ముడు ఏంటి. అంటూ సరదాగా మాట్లాడారు మహేష్. అనిల్ మహేష్ బాబును పొగుడుతూ.. ఓ పద్యం పాడి అందరినీ ఆకట్టుకున్నాడు.

అనంతరం కీర్తి సురేష్ ని ఉద్దేశించి.. కీర్తి వదిన అని అనిల్ సంబోధించగా.. వెంటనే మహేష్ కలగజేసుకుని.. కాదమ్మా నువ్వేంటి.. అందరినీ వరుసలు కలిపేసుకుంటున్నావు.. వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను.. అంటూ కామెడీగా సెటైర్ వేశారు. వెంటనే అనిల్ మాట మారుస్తూ.. కీర్తి అక్క అని పిలిచాడు.. దానికి మహేష్.. అక్కా ఏంటమ్మా.. కీర్తి అని పిలువమ్మా.. అని మళ్లీ అనిల్ కు చెప్పారు. అయినా అనిల్ కీర్తిని అక్కా అనే సంబోధించాడు.. ఇక మహేష్ చివరికి ఓకే చెప్పేశారు.

కీర్తి అక్కా ఇలాగే మంచి రోల్స్ చేస్తూ మీకీర్తిని, తెలుగు ప్రజల కీర్తిని ప్రపంచానికి వెదజల్లాలని కోరుకుంటున్నా అక్కా.. అంతే అని కీర్తిని ఉద్దేశించి మాట్లాడాడు. నువ్వు వచ్చి సాయింత్రం పరశురామ్ ను కలువమ్మా.. ఇరగదీస్తున్నావు అంటూ అనిల్ ని మహేష్ బాబు అభినందించారు. వారిద్దరి మధ్య జరిగిన సంభాషణ అందరినీ ఆకట్టుకుంది.

Tags

Read MoreRead Less
Next Story