Sathamanambhavati : శతమానంభవతికి ఐదేళ్ళు.. వదులుకున్న ఇద్దరు యంగ్ హీరోలు..!
Sathamanambhavati : శర్వానంద్, అనుపమ పరమేశ్వరన్ హీరోహీరోయిన్లుగా ప్రకాష్ రాజ్, జయసుధ కీలక పాత్రల్లో నటించిన చిత్రం శతమానంభవతి..

Sathamanambhavati : శర్వానంద్, అనుపమ పరమేశ్వరన్ హీరోహీరోయిన్లుగా ప్రకాష్ రాజ్, జయసుధ కీలక పాత్రల్లో నటించిన చిత్రం శతమానంభవతి.. ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా 14 జనవరి 2017లో రిలీజై అతిపెద్ద విజయాన్ని అందుకుంది. సతీష్ వేగేశ్న దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించారు. నేటితో ఈ చిత్రం అయిదేళ్ళు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా సినిమాకి సంబంధించిన ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
దర్శకుడు సతీష్ వేగేశ్నకి ఈ కథ ఆలోచన 1990లోనే పుట్టింది. ఆంధ్రప్రభ నిర్వహించిన కథల పోటీలో భాగంగా పల్లె ప్రయాణం ఎటు? అనే చిన్నకథను రాసి పంపించారాయన.. కానీ అప్పుడా కథ తిరస్కరించబడింది. తర్వాత దీనినే కథగా మలిచి సినిమాగా తెరకెక్కించారు సతీష్ వేగేశ్న. ,
2015లో దిల్ రాజు ప్రొడక్షన్‌లో రెండు సినిమాలకి సైన్ చేశారు మెగా హీరో సాయి ధరమ్ తేజ్.. అందులో ఒకటి అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన సుప్రీమ్ మూవీ కాగా, మరొకటి శతమానంభవతి.. అయితే డేట్స్ కుదరకపోవడంతో శతమానంభవతి సినిమా నుంచి తప్పుకున్నారు తేజ్. ఆ తర్వాత రాజ్ తరుణ్‌ని తీసుకున్నారు. కానీ చివరికి లైన్‌లోకి శర్వానంద్ వచ్చాడు. హీరోయిన్‌గా అనుపమ పరమేశ్వరన్‌ని ఎంపిక చేశారు.
సినిమాని రాజమండ్రి, అమలాపురం పరిసర ప్రాంతాల్లో తెరకెక్కించారు. కేవలం ఈ సినిమాని 49 రోజులలోనే కంప్లీట్ చేసి సంక్రాంతికి రిలీజ్ చేశారు. కేవలం రూ. 8 కోట్ల బడ్జెట్‌తో రూపొందించబడిన ఈ చిత్రం ఏకంగా 25 కోట్లకి పైగానే కొల్లగొట్టింది.
గౌతమీపుత్ర శాతకర్ణి, ఖైదీ నెం 150 లాంటి స్టార్ హీరోల సినిమాలు బరిలో ఉన్నప్పటికీ మంచి టాక్ సంపాదించుకొని ఆ సంక్రాంతికి హిట్ సినిమా అనిపించుకుంది శతమానంభవతి.
ఉత్తమ చిత్రంగా దిల్ రాజు, ఉత్తమ దర్శకుడుగా సతీష్ వేగేశ్న నంది అవార్డులు అందుకున్నారు. అంతేకాకుండా ఉత్తమ సహాయ నటి, ఉత్తమ క్యారెక్టర్ ఆర్టిస్ట్ విభాగంలో జయసుధ, నరేష్‌లు నందులు అందుకున్నారు. సినిమాటోగ్రాఫర్ సమీర్ రెడ్డిని సైతం నంది వరించింది.
ఈ సినిమాకి జాతీయ అవార్డు సైతం లభించడం విశేషం కాగా, సినిమా సక్సెస్ మీట్‌కి చిరంజీవి చీఫ్ గెస్ట్ గా రావడం మరో విశేషం.
RELATED STORIES
Gold and Silver Rates Today : పెరిగిన బంగారం, తగ్గిన వెండి ధరలు.. ఈ...
2 July 2022 5:58 AM GMTPatil Kaki : అమ్మనేర్పించిన వంట ఆమెను కోటీశ్వరురాలిని చేసింది.. పాటిల్ ...
1 July 2022 12:30 PM GMTApple iPhone: ఐఫోన్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. భారీ తగ్గింపు
1 July 2022 8:37 AM GMTGold and Silver Rates Today : భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు..
1 July 2022 5:35 AM GMTWorld's Most Expensive Car Registration Number: ప్రపంచంలోనే అత్యంత...
30 Jun 2022 7:42 AM GMTGold and Silver Rates Today : భారీగా తగ్గిన బంగారం వెండి ధరలు..
30 Jun 2022 6:08 AM GMT