Satya Dev : ఆచార్యలో సత్యదేవ్... సర్ ప్రైజ్ ఇచ్చిన మెగాస్టార్..!

Satya Dev : మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ' ఆచార్య ' చిత్రం మరికొద్ది గంటల్లో విడుదల కానుంది. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఈ సినిమాలో రామ్‌చరణ్ సిద్ధ పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. చరణ్‌కు జోడీగా పూజా హెగ్డే నటిస్తోంది. ఈ సినిమాలో మరో హీరో కూడా నటిస్తున్నాడు అంటూ చిరు సర్ ప్రైజ్ ఇచ్చాడు. ఆ హీరో మరెవరో కాదు సత్యదేవ్. ఈ విషయాన్ని స్వయంగా చిరు తన ట్విట్టర్ ద్వారా తెలియజేశాడు.
" డియర్ సత్యదేవ్.. థ్యాంక్స్ .. నీలాంటి చక్కని నటుడు నా అభిమాని కావడం చాలా సంతోషం.. ఆచార్యలో తక్కువ నిడివి పాత్రలో అయినా నువ్వు కనిపించడం నాకు ఆనందం. 'గాడ్‌ఫాదర్' సినిమాలో నా అభిమాని నాకు ఎదురు నిలబడే పూర్తి స్థాయి పాత్రలో నటించడం నాకు గర్వకారణం" అని చిరు ట్వీట్ చేశాడు.
చిరు ట్వీట్‌పై సత్యదేవ్ స్పందిస్తూ.. "అన్నయ్యా.. నటనలో జీవితంలో మాలాంటి ఎందరికో ఆచార్య మీరు.అభిమానిగా గుండెల్లో చిరకాలం తలిచేది మీ పేరునే. మిమ్మల్ని చూసే నటుడిగా మారాను. ఈరోజు ఆచార్య సినిమాలో కాసేపైనా మీతోపాటూ కనిపించే అదృష్టం కలిగింది.మీ కష్టం, క్రమశిక్షణ దగ్గర నుంచి చూసి నేర్చుకునే అవకాశం దక్కింది" అంటూ ట్వీట్ చేశాడు.
అన్నయ్యా,
— Satya Dev (@ActorSatyaDev) April 28, 2022
నటనలో జీవితంలో మాలాంటి ఎందరికో ఆచార్య మీరు.
అభిమానిగా గుండెల్లో చిరకాలం తలిచేది మీ పేరునే.
మిమ్మల్ని చూసే నటుడిగా మారాను. ఈరోజు ఆచార్య సినిమాలో కాసేపైనా మీతోపాటూ కనిపించే అదృష్టం కలిగింది.మీ కష్టం, క్రమశిక్షణ దగ్గర నుంచి చూసి నేర్చుకునే అవకాశం దక్కింది. @KChiruTweets pic.twitter.com/2Ot8A2CP03
కాగా మైత్రి మూవీ మేకర్స్, మ్యాట్నీ ఎంటర్ టైన్మెంట్ కలిసి సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకి మణిశర్మ సంగీతం అందించాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com