Karthi : సత్యం సుందరంను చాలా కట్ చేస్తున్నారట

Karthi :  సత్యం సుందరంను చాలా కట్ చేస్తున్నారట
X

కార్తీ, అరవింద్ స్వామి ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా సత్యం సుందరం. రీసెంట్ గా విడుదలైన ఈ చిత్రానికి అద్భుతమైన అప్లాజ్ వచ్చింది. 96 ఫేమ్ ప్రేమ్ కుమార్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రానికి గోవింద్ వసంత్ సంగీతం చేశాడు. హార్ట్ మెల్టింగ్ మూవీగా విమర్శకుల నుంచి కూడా గొప్ప ప్రశంసలు అందుకుంది సత్యం సుందరం. ఓ స్టార్ హీరో అయినా.. రెగ్యులర్ డ్యూయొట్స్, యాక్షన్ ఎపిసోడ్స్ ఏం లేకుండా.. కేవలం ఒక ఊరిలోనే సాగే కథగా రూపొందిన ఈ మూవీని ఒప్పుకున్న కార్తీని ఓ రేంజ్ లో పొగిడారు అంతా. అలాగే అరవింద్ స్వామిలో ఇంత గొప్ప నటుడు ఉన్నాడా అని ఆశ్చర్యపోయేలా అతని నటన కనిపించింది. ఇక కమర్షియల్ గా కూడా వర్కవుట్ అయిన సత్యం సుందరం ఓటిటి డేట్ లో మార్పులతో పాటు సినిమా లెంగ్త్ లో కూడా కొన్ని మార్పులు జరిగాయి.

సత్యం సుందరంను నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఈ నెల 27 నుంచి అన్ని భాషల్లో స్ట్రీమ్ కావాల్సి ఉంది. అయితే ఆ డేట్ ను మార్చి 25 నుంచే స్ట్రీమ్ చేయబోతున్నారు. అలాగే సినిమా ఎంత బావున్నా.. నిడివిపై కొన్ని కామెంట్స్ వచ్చాయి. ఈ మూవీ 2 గంటల 55నిమిషాలు ఉంటుంది. దాదాపు మూడు గంటలు. ఈ లెంగ్త్ ను కూడా కట్ చేసి 2 గంటల 38 నిమిషాలకు కుదించారు. దీంతో ఓటిటిలో ఫార్వార్డ్స్ లేకుండా చూసేయొచ్చు. మరి థియేటర్స్ లో అద్భుతమైన అప్లాజ్ అందుకున్న సత్యం సుందరం.. ఓటిటిల్లో ఎలాంటి రిజల్ట్ అందుకుంటారో చూడాలి.

Tags

Next Story