Satyaprem ki Katha: సక్సెస్ ఫుల్ 'సత్యప్రేమ్ కి కథా'

కార్తిక్ ఆర్యన్, కియారా అడ్వానీ జంటగా తెరకెక్కిన సినిమా సత్య ప్రేమ్ కి కథ.. గురువారం రిలీజైన ఈ మూవీ సక్సెస్ ఫుల్ గా ప్రదర్శితమవుతోంది. మొదటి రోజు రూ.9 కోట్లను కొల్లగొట్టిందని ట్రేడ్ విశ్లేషకులు తరుణ్ ఆదర్శ్ తెలిపారు. మొదటిరోజు మిశ్రమ స్పందన రాగా రెండవరోజు ఊపందుకుంది. గురువారం చివరి నాటికి బాక్స్ ఆఫీస్ వద్ద రూ.9.25 కోట్లను కొల్లగొట్టింది. మొదటి ఆటకు మిశ్రమ స్పందన వచ్చింది. మౌత్ టాక్ బలంగా ఉండటంతో సాయంత్రానికి హౌజ్ ఫుల్ కలెక్షన్లు దక్కాయి.
కార్తిక్ ఆర్యన్ కెరీర్ లో.. భూల్ భులయ్యా2, లవ్ ఆజ్ కల్ తర్వాత సత్యప్రేమ్ కి కథకు అతిపెద్ద ఓపెంగ్స్ లభించాయి. మార్నింగ్ షోలలో మామూలు ఓపెనింగ్స్ లభించగా సాయంత్రానికి వేగం పంజుకుంది. రెండవరోజు వర్కింగ్ డే కాబట్టి వసూళ్లలో తేడా ఉండవచ్చని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వీకెండ్ లో మాత్రం సత్తాచాటనుందని అన్నారు.
సత్యప్రేమ్ కథకి సమీర్ విద్వాన్ దర్వకత్వం వహించారు. సుప్రియా పాఠక్, గజరాజ్ రావ్, అనురాధ పలేల్, రాజ్ పాల్ స్క్రీన్ ను పంచుకున్నారు. ఈ సినిమాలో కార్తిక్ హ్యాపీ గో లక్కీ స్లాకర్ గా నటించారు. కార్తిక్ , కియారాల నటన సినిమాకు ప్లస్ అయిందని తెలిపారు. మంచి ఓపెనిగ్స్ తో ఈ సినిమా దూసుకెళ్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com