Double Ismart : సినిమా చూశారు.. మొత్తం కొనేశారు

Double Ismart  : సినిమా చూశారు.. మొత్తం కొనేశారు

కొన్నాళ్లుగా చాలా స్తబ్దుగా ఉన్న పూరీ జగన్నాథ్ కెరీర్ లో చాలా రోజుల తర్వాత ఒక లైట్ కనిపిస్తోంది. రిలీజ్ కు ముదే తన సినిమా అమ్ముడైపోయింది. అది కూడా ఏకంగా ఐదు భాషలకు సంబంధించి ఒకే డస్ట్రిబ్యూటర్ రైట్స్ తీసుకున్నాడు. లైగర్ డిజాస్టర్ తర్వాత ఇక పూరీ మళ్లీ లేవడం అసాధ్యం అనుకున్నారు చాలామంది. కానీ అతను డబుల్ జోష్ తో వస్తున్నాడు. ఇస్మార్ట్ శంకర్ కు సీక్వెల్ గా డబుల ఇస్మార్ట్ తో వస్తున్నాడు. మరోసారి రామ్ పోతినేని హీరోగా నటిస్తోన్న ఈ మూవీ ఆగస్ట్ 15న విడుదల కాబోతోంది. కావ్య థాపర్ హీరోయిన్.

ఇస్మార్ట్ శంకర్ లో ఒక పోలీస్ ఆఫీసర్ చిప్ ను రామ్ కు అమర్చుతారు. ఆ చిప్ లో ఉన్న మేటర్ ఏంటీ..? దానితో పోలీస్ డిపార్ట్ మెంట్ హీరో ద్వారా ఏం తెలుసుకుంది అనేది ఈపార్ట్ లో ఉండొచ్చు. దీనికి తోడు పూరీ సినిమాల తరహాలో కావాల్సినంత మసాలా కూడా ఉందనేది అర్థం అవుతూనే ఉంది. ఇక ఈ సినిమాకు సంబంధించి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఏంటంటే.. హాను మాన్ తో ఓవర్ నైట్ ఫేమ్ అయిన ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ అధినేత , నిర్మాత నిరంజన్ రెడ్డి డబుల్ ఇస్మార్ట్ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ను తీసుకున్నాడు. ఈ రైట్స్ తో పూరీకి టేబుల్ ప్రాఫిట్ వచ్చిందనే కమెంట్స్ ఉన్నాయి. నిర్మాత నిరంజన్ రెడ్డి మొదట తెలుగు వరకే రైట్స్ తీసుకోవాలనుకున్నాడు. కానీ సినిమా మొత్తం చూశాడట. ఈ మూవీ డబుల్ బ్లాక్ బస్టర్ గ్యారెంటీ అనే నమ్మకం రావడంతో మొత్తంగా ఐదు భాషల రైట్స్ ను తీసుకున్నాడు అని అనౌన్స్ మెంట్ కూడా ఇవ్వడం విశేషం.

ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్ గా రాబోతోన్న ఈ మూవీని ఛార్మితో కలిసి పూరీ కనెక్ట్స్ పేరుతో తనే నిర్మించాడు దర్శకుడు. సంజయ్ దత్ విలన్ గా నటంచడం పెద్ద ప్లస్ పాయింట్ అంటున్నారు. మొత్తంగా కొన్నాళ్లుగా పూరీ సినిమాకు ఇలా రిలీజ్ కు చాలా రోజుల ముందే డిస్ట్రిబ్యూషన్ రైట్స్ అమ్ముడుపోవడం ఆశ్చర్యమే. కాకపోతే లైగర్ తో నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్స్ పూరీని టార్గెట్ చేసే అవకాశాలున్నాయి. మరి వారికి ఏం సమాధానం చెబుతాడో చూడాలి.

Tags

Next Story