Sudheer Babu : మా నాన్న సూపర్ హీరో నుంచి పెళ్లి సాంగ్

సుధీర్ బాబు, సాయి చంద్, షాయాజీ షిండే ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా మా నాన్న సూపర్ హీరో. అక్టోబర్ 11న విడుదల కాబోతన్న ఈ చిత్రాన్ని అభిలాష్ కంకర డైరెక్ట్ చేశాడు. సునిల్ బలుసు నిర్మాత. ఈ మధ్య కాలంలో చూడగానే ప్రతి ఒక్కరూ ఫిదా అయిన టీజర్ ఈ మూవీదే. ఆ స్థాయిలో ఆకట్టుకుంది. తండ్రి కొడుకుల బంధాన్ని సరికొత్త కోణంలో ఆవిష్కరిస్తోన్న సినిమాలా అనిపించింది. అలాగే తన తండ్రి గొప్పదనం గురించి కొడుకు పాడుకున్న పాటను ఫస్ట్ లిరికల్ సాంగ్ విడుదల చేసింది టీమ్. ఆ పాటా అద్భుతంగా ఉంది అన్నారు చాలామంది. లేటెస్ట్ గా మా నాన్న సూపర్ హీరో నుంచి మరో సాంగ్ విడుదల చేశారు.
‘వేడుకలో ఉన్నది కాలం.. వేదిక ఈ కళ్యాణం.. ఏడడుగుల మొదటి ప్రయాణం.. జతగా ప్రారంభం..’ అంటూ సాగే ఈ గీతాన్ని సానపాటి భరద్వాజ పాత్రుడు రాశాడు. ఐశ్వర్య దారూరి, బృందా, చైతూ సత్సంగ్, అఖిల్ చంద్ర పాడారు. ఈ చిత్రానికి జే కృష్ణ సంగీతం అందించాడు. పెళ్లికి సంబంధించిన పాటంటే మాగ్జిమం హుషారుగానే ఉంటాయి. ఇది కూడా అంతే హుషారుగా ఉంది. ఇలాంటి పాటలకు మంచి స్టెప్పులు కూరుస్తాడు రాజు సుందరం మాస్టర్. అతని కంపోజిషన్ లో తనూ కనిపించాడు.
ఫస్ట్ లిరికల్ సాంగ్ లో షాయాజీ షిండేను హైలెట్ చేస్తే ఈ పాటలో సాయి చంద్ ను హైలెట్ చేశారు. ఈ ఇద్దరిలో అసలు తండ్రి ఎవరు అనేది సినిమాలోనే చూడాలి. విశేషం ఏంటంటే.. ఎంత తండ్రి కొడుకుల మధ్య సాగే సినిమా అయినా మనవాళ్లు ఎప్పుడూ.. హీరోయిన్ తో ఉన్న పాటను, హీరోలు హైలెట్ అయ్యే పాటలే విడుదల చేశారు. బట్ ఈ మూవీ విషయంలో రెండు పాటల్లోనూ హీరోయిన్ ప్రస్తావనే లేదు. ఇది చాలదూ.. వీళ్లు ఈ కంటెంట్ ను ఎంత బలంగా నమ్మారో తెలియడానికి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com