Champion Movie : ఛాంపియన్ నుంచి రెండో పాట రిలీజ్

Champion Movie :  ఛాంపియన్ నుంచి రెండో పాట రిలీజ్
X

శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా నటించిన మూవీ ఛాంపియన్. పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతోన్న మూవీ ఇది. ఈ నెల 25న క్రిస్మస్ సందర్భంగా విడుదల కాబోతోంది మూవీ. ఈ మూవీ నుంచి గిరా గిరా గిరా అనే పాట మాత్రం బ్లాక్ బస్టర్ అయింది. ఈ పాటకు అద్భుతమైన స్పందన వచ్చింది. మిక్కీ జే మేయర్ సంగీతం అందించాడు. ఈ సినిమా నుంచి మరో పాట కూడా విడుదల చేశారు. ఇది సిట్యుయేషనల్ సాంగ్ గా కనిపిస్తోంది.

‘సల్లంగుండాలే.. పెళ్లి చేసుకుని నువ్వు పైలెంగుండేలే.. ’ అంటూ సాగే గీతం ఇది. కళ్యాణ చక్రవర్తి కీలకంగా ఈ పాటలో కనిపించబోతున్నాడు. ఈ పాటకు తగ్గట్టుగానే అతని డైలాగ్స్ కూడా ఉన్నాయి. అలాగే సీనియర్ యాక్ట్రెస్ అర్చన కూడా కీలకంగా కనిపిస్తోంది. ఈ సినిమాలోని కీలకంగా కనిపించే ఆర్టిస్టులందరు ఈ పాటలో కనిపించబోతున్నారు అనిపించేలా ఉన్నాడు. ఆ పాటలో ఆ అమ్మాయి పెళ్లి సందర్భంగా ఎవరెవరు ఏం చేస్తారు.. ఏం అందించబోతున్నారు అనిపించారు.

రోషన్ తో పాటు హీరోయిన్ అనస్వర రాజన్ కూడా కీలకంగానే ఈ పాటలో నర్తించారు. ఇంకా చెబితే అనస్వర డ్యాన్స్ కాస్త హైలెట్ గానే ఉంది. ఆ అమ్మాయి కోసమే అబ్బాయి సాగించే డ్యాన్స్ అనిపించేలా ఉన్నాడు. పాట మాత్రం పాతదనం కొంత కలిపితే ఉన్నట్టుగా ఉంది. దీంతో పాటు అంతమంది పాడుతున్నట్టుగా ఉండే పాట కేవలం ఒకే వ్యక్తితో పాడించినట్టు కనిపిస్తోంది. రితేష్ జి రావు, మనీషా ఈరబత్తిన కలిసి పాడారు. కానీ ఈ గాత్రంలో ఎలాంటి వైవిధ్యం కనిపించలేదు. అందుకే ఈ చిత్రం నుంచి రెండో పాట మాత్రం అంత గొప్పగా కనిపించలేదు అనిపిస్తోంది.ఇక ప్రదీప్ అద్వైతం డైరెక్ట్ చేసిన చిత్రం ఇది. ప్రియాంక దత్, జికే మోహన్, జెమినీ కిరణ్ నిర్మాతలు.

Tags

Next Story