Seethamma Vakitlo Sirimalle Chettu : చిన్నోడు పెద్దోడు మళ్లీ కొట్టారు

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు .. 2013లో అప్పుడు హీరోలంతా ఎవరికి వాళ్లు 50 కోట్లు 100 కోట్ల మార్కెట్ కోసం ఆరాటపడుతున్న రోజులు. మల్టీస్టారర్ అనే మాటే లేదు. బట్ వెంకటేష్, మహేష్ బాబు లాంటి హీరోలతో దిల్ రాజు మల్టీస్టారర్ అనౌన్స్ చేసినప్పుడు ఆశ్చర్యపోయారు. మాస్ అండ్ క్లాస్ కాంబినేషన్ లో ఓ సూపర్ మూవీ వస్తుందనుకున్నారు. బట్ దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల హీరోలిద్దరినీ పూర్తిగా గోదావరి జిల్లాలకు పరిమితం చేసి.. ప్యూర్ క్లాస్ మూవీ అందించాడు. అది ఆడియన్స్ కు ‘అప్పుడు’ వందశాతం నచ్చలేదు. బట్ కొన్నాళ్ల తర్వాత టివిల్లోనూ, యూ ట్యూబ్ లోనూ చూసినప్పుడు అరే ఇది క్లాసిక్ కదా అనుకున్నారు. ఆ క్లాసిక్ ను రీ రిలీజ్ చేస్తే ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది..? యస్.. ఊహించినట్టుగానే రీ రిలీజ్ లో బ్లాక్ బస్టర్ అనిపించుకుంటోందీ మూవీ. ఇప్పటికే చాలాసార్లు చూసినా.. థియేటర్స్ లో ఇప్పుడు ‘అసలు’ఫీల్ తో చూస్తున్నప్పుడు హార్ట్ టచింగ్ అనేస్తున్నారు ఆడియన్స్.
ప్రతి సీన్ ను ఎంజాయ్ చేస్తున్నారు. కొన్ని సీన్స్ ను థియేటర్స్ లోనే రీ క్రియేట్ చేస్తున్నారు. మామూలుగా మాస్ మూవీస్ కు జరుగుతుంది ఇలా. అయినా ఈ సినిమాకు జరగడంలో వింతేం లేదు. చిన్నోడు, పెద్దోడు చేస్తోన్న సందడికి థియేటర్స్ మాంచి ఎంటర్టైనింగ్ మూడ్ లో ఉన్నాయి. దిల్ రాజు కేవలం తను భుజాల మీదే వేసుకుని సినిమాను ప్రమోట్ చేశాడు. అతని కష్టం ఫలించింది. ఈ సారి బ్లాక్ బస్టర్ అనేస్తున్నారు. ఇంకా ఎక్కువ థియేటర్స్ లో రిలీజ్ చేసి ఉంటే రెవిన్యూ కూడా బావుండేది. అయినా రిలీజ్ అయిన థియేటర్స్ అన్నీ రిలీజ్ కు ముందే అడ్వాన్స్ బుకింగ్స్ తోనే ఫుల్ అయిపోయాయి. అదీ చిన్నోడు పెద్దోడి మ్యాజిక్. ఇక రేలంగి మామయ్యగా ప్రకాష్ రాజ్, జయసుధ, బామ్మగా రోహిణి హట్టంగడి, సమంత, అంజలి, రావు రమేష్ ఇలా ప్రతి పాత్రకూ ప్రాధాన్యత ఉండే ఈ మూవీలోని అన్ని క్యారెక్టర్స్ సహజంగా రాసుకోవడంలో సూపర్ సక్సెస్ అయ్యాడు శ్రీకాంత్ అడ్డాల. మొత్తంగా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ఈ సారి ఇంకా పెద్ద హిట్టు అనిపించుకుంటోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com