Trans Of Kubera : శేఖర్ కమ్ముల కుబేర టీజర్ .. ఏం ట్రాన్స్ గురూ..

ఇప్పటి వరకూ సెన్సిబుల్ మూవీ మేకర్ అనిపించుకున్న శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో రూపొందుతోన్న మూవీ కుబేర. లేటెస్ట్ గా ట్రాన్స్ ఆఫ్ కుబేర అంటూ టీజర్ విడుదల చేశారు. ఈ టీజర్ చూస్తే ఇకపై శేఖర్ కమ్ములను సెన్సేషనల్ డైరెక్టర్ అని పిలుచుకోవడం ఖాయం అనిపించేలా ఉంది. టీజర్ ఎంత హైలెట్ గా ఉందో అంతకు మించి దేవీశ్రీ ప్రసాద్ నేపథ్య సంగీతం కనిపిస్తోంది. ఒక్కో పాత్రను పరిచయం చేస్తూ సాగిన డైలాగ్స్ చూస్తే శేఖర్ ఈ మూవీతో ఓ పెద్దం సంచలనమే సృష్టించబోతున్నాడని అర్థం అవుతోంది. సామాజిక సమస్యల నేపథ్యంలో కథనం ఉండబోతోందని తెలుస్తోంది.
‘నాది నాది నాది నాదే ఈ లోకమంతా.. నేల నాది, గింజ నాది కూత వేసే జైలు నావి, గాలి నాది, గనులు నావి, భూగర్భపు సిరులు నావి, కోట నాది కొలువు నాది కోరుకున్నదల్ల నాది.. నాదే ఈ లోకమంతా’.. అంటూ మూవీలో నెగెటివ్ షేడ్ లో కనిపిస్తోన్న జిమ్ సరభ్ డైలాగ్ తో ప్రారంభమై ప్రతి డైలాగ్ కు రిఫ్లెక్ట్ అయ్యే కంటెంట్ అద్భుతమైన ఫ్రేమింగ్ లో నాగార్జునను పరిచయం చేసి చూపిస్తూ సాగుతోంది. ఆ తరవాత ధనుష్ డైలాగ్.. ‘నాది నాది నాది నాదే ఈ లోకమంతా.. కన్ను నాది కాంతి నాది ఏరుకున్న కలలు నావి, ఆట నాది పాట నాది బాటపక్క చోటు నాది, బాధ నాది బరువు నాది బతుకు కొరకే బతుకు నాది.. నాది నాది నాదే ఈ లోకమంతా’అంటూ సాగుతుంది. ఈ డైలాగ్స్ తో పాటుగా వచ్చిన ప్రతి ఫ్రేమ్ ఎక్స్ ట్రార్డినరీ అని చెప్పాలి.
హీరో ఎంట్రీ ఇలా, సీనియర్ కాబట్టి నాగ్ ఎంట్రీ ఇలా, నేషనల్ క్రష్ కాబట్టి రష్మికను ఇలా పరిచయం చేయాలి. అంటూ రెగ్యులర్ కమర్షియల్ లెక్కలు మచ్చుకు కూడా కనిపించకుండా ప్రతి ఫ్రేమ్ తో మెస్మరైజ్ చేశాడు శేఖర్ కమ్ముల. అయితే కంటెంట్ పరంగా చూస్తే తనకంటే బలవంతుడైన ప్రత్యర్థిని ఎదుర్కోవడానికి తిండికి టికానా లేని బిచ్చగాడు లాంటి ధనుష్ ను చేరదీసి తన స్థానంలో నిలబెట్టే లాంటి పాత్రలో నాగార్జున కనిపిస్తున్నాడు. వీటికి అలవాటు పడలేక దరిద్రాన్ని వదులుకోలేక తంటాలు పడేలాంటి పాత్రలో ధనుష్ కనిపిస్తున్నాడు. రష్మిక పాత్ర మాత్రం కాస్త సీక్రెట్ గా కనిపిస్తోంది. మొత్తంగా లేట్ అయినా ఈ మూవీతో శేఖర్ కమ్ముల అనేక సంచలనాలు సృష్టించబోతున్నాడు అనేలా ఉందీ టీజర్. జూన్ 20న విడుదల కాబోతోన్న ఈ చిత్రాన్ని శేఖర్ కమ్ముల, సునిల్ నారంగ్, పుష్కర్ రామ్ మోహన్ రావు నిర్మిస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com