Sekhar Kammula : ఇన్నాళ్లకు ఈ కాంబినేషన్ సెట్ అయిందా

Sekhar Kammula :  ఇన్నాళ్లకు ఈ కాంబినేషన్ సెట్ అయిందా
X

కొన్ని కాంబినేషన్స్ కోసం చాలామంది ఎదురుచూస్తుంటారు. అందుకు కారణం ఆయా వ్యక్తుల సినిమాల స్టైలే. శేఖర్ కమ్ముల అనగానే తెలుగులో సెన్సిబుల్ మూవీస్ తో ఓ గొప్ప దర్శకుడు అన్న పేరు తెచ్చుకున్నాడు. ఈయన సినిమా అంటే అన్ని వర్గాల ప్రేక్షకులకూ ఇష్టం. ఇలాంటి ఇమేజ్ సంపాదించడం అంత సులువేం కాదు. శేఖర్ సినిమా అంటే యూత్, విమెన్, ఓల్డ్ పీపుల్ తో పాటు చిన్నవాల్లు కూడా పొలోమని వచ్చేస్తారు. అతనిప్పుడు ఫస్ట్ టైమ్ స్టార్స్ తో సినిమా చేస్తున్నాడు. నాగార్జున, ధనుష్, రష్మిక ప్రధాన పాత్రల్లో కుబేర చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. సమ్మర్ లో ఈ చిత్రం విడుదల కాబోతోంది.

ఇక శేఖర్ కమ్ముల లాగే సెన్సిబుల్ మూవీస్ లో హీరోగా నటిస్తూ పక్కింటి అబ్బాయిలా కనిపిస్తూ నేచురల్ స్టార్ ఇమేజ్ సంపాదించుకున్నాడు నాని. కొన్నాళ్లుగా మాస్ మంత్రం జపిస్తున్నాడు కానీ.. అతనికి ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిందే ఈ సెన్సిబుల్ మూవీస్ వల్ల. అలాంటి వీరి కాంబోలో సినిమా కోసం చాలామంది ఎదురుచూశారు. ఇప్పటి వరకూ కుదరలేదు కానీ ఫైనల్ గా సెట్ అయిందంటున్నారు. ప్రస్తుతం నాని హిట్ 3, ద ప్యారడైజ్ మూవీస్ చేస్తున్నాడు. వీటిలో హిట్ 3 ఆల్మోస్ట్ పూర్తయినట్టే. ప్యారడైజ్ షూటింగ్ కూడా వేగంగా సాగుతోంది.

ఈ రెండు సినిమాల తర్వాత నాని - శేఖర్ కమ్ముల కాంబినేషన్ లో సినిమాకు రంగం సిద్ధమైంది అని టాక్. ఈ చిత్రాన్ని కూడా శేఖర్ కమ్ముల ఆస్థాన బ్యానర్ ఏసియన్ సినిమాస్ ప్రొడ్యూస్ చేస్తుందట. ప్రస్తుతం చర్చల దశలో ఉందంటున్నారు. అన్నీ సెట్ అయితే త్వరలోనే అఫీషియల్ అనౌన్స్ మెంట్ వస్తుంది.

Tags

Next Story